బాలీవుడ్ జోడి రణ్బీర్ కపూర్, ఆలియా భట్ మధ్య ప్రేమాయణం గురించి సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారన్న వార్తలూ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రణ్బీర్-ఆలియా పెళ్లి దుస్తుల్లో ఉన్న ఒక ఫొటో నెట్టింట వైరల్గా మారింది.
ఇప్పటికే ఆలియా తండ్రిని కలిసిన రణ్బీర్ పెళ్లి విషయమై ప్రస్తావించినట్లు సమాచారం. కానీ రెండు కుటుంబాలు దీనిపై ఇప్పటి వరకు అధికారిక వివరణ ఇవ్వలేదు. అయినా వీరిద్దరూ 2020లో పెళ్లి పీటలెక్కనున్నట్లు పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి.ఇలాంటి సమయంలో ఓ అభిమాని సామాజిక మాధ్యమాల్లో వీరిద్దరి ఫొటోను మార్ఫింగ్ చేసి షేర్ చేశాడు. పెళ్లి దుస్తుల్లో ఉన్న ఈ స్టిల్ నెట్టింట హల్చల్ చేస్తోంది.
ప్రస్తుతం వీరిద్దరూ 'బ్రహ్ర్మాస్త్ర' చిత్రంలో బిజీగా ఉన్నారు. తొలిసారి ఈ జోడి తెరపై సందడి చేయనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. 2020లో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
ఇవీ చూడండి.. తెలుగులో హృతిక్-వాణీ రొమాంటిక్ సాంగ్