మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. తమ జీవితంలోని ముఖ్యమైన మహిళల గురించి ప్రస్తావించారు. మహేశ్‌బాబు, నాగశౌర్య, అఖిల్ తదితరులు సోషల్‌మీడియా వేదికగా కుటుంబ సభ్యుల ఫొటోలు షేర్ చేశారు. మహేశ్ తన సతీమణి నమ్రత, తల్లి ఇందిరాదేవి, కుమార్తె సితార ఫొటోలను షేర్ చేశాడు.
"ఈ ముగ్గురు మహిళలు నా ఉనికికి నిర్వచనం. వారికి, మహిళలందరికీ మరింత బలం చేకూరాలి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు" అని మహిళలను ఉద్దేశించి మహేశ్‌బాబు స్పందించాడు.
![tollywood heros wishes to his mothers Womens Day wishes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6339814_3.jpg)
"నా ప్రియమైన సన్‌షైన్ అమలకు, మిగిలిన లవ్లీ మహిళలకు శుభాకాంక్షలు. మీరు లేనిదే ఈ ప్రపంచానికి వెలుగు లేదు" అంటూ అఖిల్ తన తల్లితో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నాడు.
![tollywood heros wishes to his mothers Womens Day wishes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6339814_2.jpg)
నాగశౌర్య తన తల్లి ఉషతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు. "మహిళ అందరి మంచి కోరుకుంటుంది. శక్తిమంతమైంది, తెలివైంది, సృజనాత్మకత ఎక్కువ. పురుషుడి కంటే ఎక్కువ బాధ్యతగా వ్యవహరిస్తుంది. ధన్యవాదాలు అమ్మా. నాకు ఈ జన్మ ఇచ్చినందుకు, నా జీవితానికి అర్థం తెలిపినందుకు థాంక్యూ. మిగిలిన అందరు మహిళలకు హ్యాపీ ఉమెన్స్‌డే" అని తెలిపాడు నాగశౌర్య.
![tollywood heros wishes to his mothers Womens Day wishes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6339814_1.jpg)
ఇదీ చూడండి.. ఉమెన్స్ డే: మరపురాని మహిళా ప్రాధాన్య తెలుగు సినిమాలు