ETV Bharat / sitara

సింగర్​గా టైగర్​ ష్రాఫ్.. త్వరలో సాంగ్ రిలీజ్​

బాలీవుడ్​ హీరో టైగర్​ ష్రాఫ్​.. 'అన్​బిలీవబుల్'​ అనే సాంగ్​తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఇందుకు సంబంధించిన మోషన్​ పోస్టర్​ను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకున్నాడీ హీరో.

Tiger Shroff
టైగర్​ ష్రాఫ్​
author img

By

Published : Sep 7, 2020, 4:07 PM IST

'హీరోపంతి' చిత్రంతో బాలీవుడ్​లోకి అడుగుపెట్టి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న​ హీరో టైగర్​ ష్రాఫ్. నటనతో పాటు, డ్యాన్స్​, ఫైట్స్​తో అభిమానులను ఫిదా చేశాడు. అయితే, ప్రస్తుతం తాను ఓ సాంగ్​తో తొలిసారి గాయకుడిగా మారనున్నట్లు ష్రాఫ్​ తెలిపాడు. 'అన్​బిలీవబుల్' అనే పాటకు సంబంధించిన మోషన్​ పోస్టర్​ను ఇన్​స్టాగ్రామ్​ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

"ఎప్పుడూ నేను పాడిన పాటకు డ్యాన్స్​ చేయాలని అనుకుంటుంటా. కానీ, దానిని ముందుకు తీసుకెళ్లే ధైర్యం ఇంతవరకు రాలేదు. లాక్​డౌన్​ సమయంలో ఈ విషయంపై చాలా సమయం వెచ్చించి మరీ ఇప్పుడు మీ ముందుకొస్తున్నా. ఇది నిజంగా నమ్మశక్యం కాని అనుభవం. త్వరలోనే నా ఈ సరికొత్త ప్రయత్నాన్ని మీతో పంచుకుంటా."

-టైగర్​ ష్రాఫ్​, సినీ నటుడు

బిగ్ బ్యాంగ్ మ్యూజిక్ నిర్మించిన ఈ ట్రాక్‌ను డీజీ మేన్, అవితేష్ రాశారు. టైగర్​ ష్రాఫ్​ నటించిన 'స్టూడెంట్​ ఆఫ్​ ది ఇయర్​ 2' సినిమా డైరెక్టర్​ పునిత్​ మల్హోత్రా.. ఈ పాటకు దర్శకత్వం వహించాడు. పరేశ్​ శిరోద్కర్​ కొరియోగ్రాఫర్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.