మిల్కీబ్యూటీ తమన్నా.. తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ హవా కొనసాగిస్తోంది. బాలీవుడ్‌లోనూ కొన్ని చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు వెబ్‌సిరీస్‌ల్లోనూ ప్రధాన పాత్రలు చేస్తోంది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెలుగులో వచ్చిన '11th అవర్'లో వాపారవేత్త ఆరాత్రికారెడ్డిగా మెప్పించింది. తన రెండో వెబ్ చిత్రంగా తమిళంలో 'నవంబర్ స్టోరీ' చేస్తోంది. ఆనంద వికటన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమమైన ఈ సినిమాకు ఇంద్ర సుబ్రమణియన్ దర్శకత్వం వహించారు. సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను ఇప్పుడు విడుదల చేశారు. మే 20న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వీఐపీలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
జీఎం కుమార్ కీలక పాత్రలో నటించగా పసుపతి, వివేక్ ప్రసన్న, అరుళ్ దాస్, నందిని తదితరులు ఇతర పాత్రల్లో పోషించారు. ప్రముఖ క్రైమ్ నవలా రచయిత గణేశన్ (జీఎం కుమార్) అల్జీమర్స్ (మతిమరుపు వ్యాధి)తో బాధపడుతుంటాడు. ఆయనకు ఒక కూతురు, పేరు అనురాధ (తమన్నా) ఎథికల్ హ్యాకర్‌గా పనిచేస్తుంటుంది. తండ్రీకూతుళ్లు ఒకే ఇంట్లో నివసిస్తుంటారు. అయితే నవంబర్ 16న ఓ పాడుబడిన ఇంట్లో పెయింటింగ్‌తో కప్పి ఉంచిన ఒక మహిళ మృతదేహం బయటపడుతుంది. వెంటనే అక్కడి చేరుకున్న పోలీసులు అనురాధ తండ్రి గణేశన్ అనుమానిస్తారు. అక్కడి పరిస్థితి, సాక్ష్యాలు కూడా గణేశ్ నేరస్థుడు అనే విధంగా ఉంటాయి. అప్పుడు అనురాధ తన తండ్రి నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు ప్రయత్నం చేస్తుంది. మరీ ఆ హత్య ఎవరు చేశారో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. తమన్నా ఇందులో తెలివైన స్వతంత్ర్య భావాలు కలిగిన యువతిగా కనిపించనుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">