ETV Bharat / sitara

స్టేజ్​పై కన్నీళ్లు పెట్టుకున్న కంగనా రనౌత్​ - తలైవి ట్రైలర్ వార్తలు

'తలైవి' ట్రైలర్​ విడుదల కార్యక్రమంలో బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ కన్నీటి పర్యంతమయ్యారు. నటిగా తనకు ఈ సినిమా ఎంతో ప్రత్యేకమని మాట్లాడుతూ భావోద్వోగానికి లోనయ్యారు.

Thalaivi trailer launch: Kangana Ranaut breaks down lauding AL Vijay, Arvind Swamy
కంగనా రనౌత్
author img

By

Published : Mar 24, 2021, 8:54 AM IST

Updated : Mar 24, 2021, 12:29 PM IST

బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌ కన్నీటిపర్యంతమయ్యారు. 'తలైవి' ట్రైలర్​ విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా విజయ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రంలో జయలలిత పాత్రను కంగన పోషించారు.

'తలైవి' ట్రైలర్​ కార్యక్రమంలో మాట్లాడుతున్న కంగనా రనౌత్

"ఈ సందర్భంగా నేను ఒకరికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఆయన నా ప్రతిభపై నాకు నమ్మకం కలిగేలా చేశారు. సాధారణంగా.. సినిమా సెట్లో ఒక హీరోతో ఉన్నంత చనువుగా ఒక నటితో ఎవరూ ఉండరు. కానీ.. నటీనటులతో ఎలా వ్యవహరించాలనే విషయాన్ని ఆయనను చూసి నేర్చుకున్నా" అని సినిమా డైరెక్టర్‌ విజయ్‌ను ఉద్దేశిస్తూ కంగన చెప్పుకొచ్చారు.

ఈక్రమంలో కంగన భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. "నేను ఎప్పుడూ ఏడవను. నన్ను ఏడిపించే హక్కు ఎవ్వరికీ ఇవ్వను. నేను చివరిగా ఏడ్చింది ఎప్పుడో కూడా గుర్తులేదు. కానీ.. ఈ రోజు నేను ఏడ్చాను. ఇప్పుడు మనసు తేలికగా ఉంది" అని ఆ తర్వాత చేసిన ట్వీట్‌లో కంగన పేర్కొన్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 23న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ప్రకాష్‌రాజ్‌, అరవిందస్వామి కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి: ట్రైలర్​: మహాభారతానికి మరో పేరుంది.. అదే 'జయ'!

Last Updated : Mar 24, 2021, 12:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.