ETV Bharat / sitara

Bollywood: బాలీవుడ్​లో వినిపిస్తున్న 'తెలుగు' పాట

గత కొన్నేళ్ల నుంచి తెలుగు సినిమాలే కాకుండా మన పాటలు కూడా హిందీ చిత్రసీమలో వినిపిస్తున్నాయి. ఇటీవల వచ్చిన సల్మాన్ 'రాధే'లోని సీటీమార్ సాంగ్ దానికి ఉదాహరణ. ఇంకా ఏయేం పాటలు అక్కడ రీమేకై మార్మోగాయో ఇప్పుడు చూద్దాం.

telugu songs remake in bollywood list
సల్మాన్ రాధే మూవీ
author img

By

Published : Jun 13, 2021, 9:55 AM IST

తెలుగు సినిమాలు దశాబ్దకాలంగా బాలీవుడ్‌లో బాగా రీమేక్‌ అవుతున్నాయి. ఇటీవల వాటి సంఖ్య ఇంకాస్త ఎక్కువైంది. మన సినిమా కథల్ని మాత్రమే కాదు, పాటల్నీ బాలీవుడ్‌ బాగా ఇష్టపడుతోంది. ఆ ఇష్టమే ఇక్కడి ట్యూన్లు అక్కడా వినిపించేలా చేస్తోంది!

సల్మాన్‌ఖాన్‌ తాజా సినిమా 'రాధే' గురించి తెలుగువాళ్లూ ఎక్కువగా చర్చించడానికి ఓ కారణం ఆ సినిమాని ఓటీటీలో రిలీజ్‌ చేయడమైతే, రెండోది అందులోని ‘సీటీమార్‌’ పాట. సల్మాన్‌ సరసన దిశా పటానీ నటించిన ఈ సినిమాకు దర్శకుడు ప్రభుదేవా. దేవిశ్రీప్రసాద్‌ స్వరపర్చిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలోని ‘సీటీమార్‌’ పాట ట్యూన్‌కు చిన్నపాటి మార్పులుచేసి దీన్లో వాడుకున్నారు. సల్మాన్‌, ప్రభుదేవా కోరి మరీ దేవిశ్రీతో ఈ పాటను రీకంపోజ్‌ చేయించుకున్నారు. వినడానికి రెండు పాటలూ దాదాపు ఒకేలా ఉన్నా, డ్యాన్స్‌ విషయంలో బాలీవుడ్‌ సీటీమార్‌ చాలా వెనకబడిపోయిందంటూ మీమ్స్‌ రావడం విశేషం. సల్మాన్‌ తన సినిమాలో తెలుగు పాట ట్యూన్‌ పెట్టుకోవడం ఇదేం మొదటిసారి కాదు. పదేళ్ల కిందట వచ్చిన తన ‘రెడీ’ సినిమాలో ‘ఆర్య-2’ కోసం దేవీశ్రీ ట్యూన్‌ చేసిన ‘రింగ రింగ’ పాటనీ పెట్టుకున్నాడు. ‘ఢింక చికా’గా వచ్చిన ఆ పాట పెద్ద హిట్‌ అయింది కూడా. ఆ సినిమా రామ్‌ నటించిన ‘రెడీ’కి రీమేక్‌.

seetimaar song
దువ్వాడ జగన్నాథం సినిమాలోని సీటీమార్ పాట

యూట్యూబ్‌లో ‘అ అంటే అమలాపురం’ అని సెర్చ్‌ చేయగానే రెండు పాటలు వస్తాయి. అందులో ఒకటి ‘ఆర్య’లోది కాగా రెండోది బాలీవుడ్‌ సినిమా ‘మేగ్జిమమ్‌’లోది. తెలుగు నుంచి చాలా పాటల ట్యూన్లు మాత్రమే తీసుకోగా, ఈ పాటలో మాత్రం ‘అ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఇ అంటే...’ వరకూ కూడా అచ్చం తెలుగు పదాల్ని పెట్టేశారు. దీనికి హిందీ వెర్షన్‌ కంపోజర్‌ కూడా దేవిశ్రీనే. అంటే మన దేవీ పాటలు దక్షిణాదినే కాదు, ఉత్తరాదినీ ఉర్రూతలూగిస్తున్నాయన్నమాట.

salman khan devisri prasad
దేవిశ్రీప్రసాద్​తో సల్మాన్ ఖాన్

‘చూపులతో గుచ్చి గుచ్చి చంపకే...’ పాట గుర్తుందిగా! ‘ఇడియట్‌’ సినిమాలోని ఆ పాటను ఎలా మర్చిపోగలమంటారా! ఈ పాట స్వరకర్త చక్రి. ఇదే పాట ట్యూన్‌ని గతేడాది రెండు బాలీవుడ్‌ సినిమాల్లో వాడటం విశేషం. ‘జిన్నీ వెడ్స్‌ సన్నీ’లో పాయల్‌ దేవ్‌ దీనికి తనదైన శైలిలో మార్పులు చేసి కొత్త పాట సృష్టించగా... ఇదే పాటని ఆ సినిమా కోసం పాడిన మికా సింగ్‌ తాను సంగీతం అందించిన ‘ఇందూ కీ జవానీ’ సినిమాలో మరో రకంగా మార్పుచేసి పెట్టాడు. ఇందులో కథానాయిక కియారా అడ్వానీ. ఇది సోషల్‌ మీడియా కాలం. విన్నవాళ్లు ఊరుకుంటారా చెప్పండి. ‘కాపీకి కాపీ’ అంటూ పెద్ద ఎత్తునే స్పందించారు. బాగా హిట్‌ అయిన పాటలే కాదు, వినీవినిపించని పాటల్ని పట్టేసి ట్యూన్లు అటూఇటూగా మార్చేసిన పాటలూ ఉన్నాయి. ‘ఒట్టేసి చెబుతున్నా’ సినిమా కోసం విద్యాసాగర్‌ స్వరపర్చిన ‘ఏలో ఏలో ఏలూరోడా... ఏస్కో ఏస్కో గోలీ సోడా’ పాట ట్యూన్‌ని అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘రౌడీ రాథోర్‌’ సినిమాలో వాడారు. ‘ఆ రే ప్రీతమ్‌ ప్యారే’గా వచ్చిన ఈ పాటని సాజిద్‌ వాజిద్‌ స్వరపర్చారు. తెలుగు ‘విక్రమార్కుడు’ సినిమాకి ఇది రీమేక్‌.

కాస్త వెనక్కి వెళ్తే ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ కోసం ఇళయరాజా స్వరపర్చిన ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’ పాట తెలియని తెలుగు సినీ ప్రేమికులు ఉండరంటే అతిశయం కాదు. ఇదే ట్యూన్‌ని 1992లో అనిల్‌ కపూర్‌ సినిమా ‘బేటా’ కోసం తీసుకున్నారు. ‘ధక్‌ ధక్‌ కర్నే లగా’గా వచ్చిన ఆ పాట సూపర్‌డూపర్‌ హిట్‌. కీరవాణి సంగీతం అందించిన ‘అల్లరి ప్రియుడు’లో ‘రోజ్‌ రోజ్‌ రోజ్‌ రోజా పువ్వా’ ట్యూన్‌ని అక్కడ ‘సుహాగ్‌’లో వాడారు. ‘ప్యార్‌ ప్యార్‌ ప్యార్‌ మేరా...’ అంటూ వచ్చిన ఆ పాటని నగ్మా, అక్షయ్‌లమీద చిత్రీకరించారు. అక్కడ కూడా అది పెద్ద హిట్‌. మన ట్యూన్‌లు బాలీవుడ్‌కు వెళ్లడం, అక్కడి ట్యూన్లు ఇక్కడికి రావడం ఎన్టీయార్‌, ఏఎన్నార్‌ కాలంనుంచీ ఉన్నదే. అయితే ఇటీవల మన ట్యూన్లే వరసగా అక్కడకు వెళ్లి కేక పుట్టిస్తున్నాయి. ఒకప్పుడు మెలోడీ పాటల్ని టాలీవుడ్‌ నుంచి తీసుకున్న బాలీవుడ్‌ సంగీత దర్శకులు ఇప్పుడు మాంచి ఊపున్న పాటలకే ప్రాధాన్యం ఇస్తుండడం విశేషం.

kiara adwani
కియారా అడ్వాణీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.