తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్(corona update) దాదాపు అదుపులోకి వచ్చింది. థియేటర్(theatre hyderabad) సమస్యలు ఒకొక్కటిగా తొలగుతుండటం వల్ల.. విడుదలకు సిద్ధమైన చిత్రాలన్నీ బాక్సాఫీస్ ముందుకు వరుస కడుతున్నాయి. ప్రేక్షకులూ నెమ్మదిగా థియేటర్లకు అలవాటు పడుతుండటం వల్ల.. సినీ వ్యాపారం క్రమంగా జోరందుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల సమస్య(movie tickets online andhra pradesh) ఇప్పటికీ కొలిక్కి రాకున్నా.. డిసెంబరు కల్లా అన్ని సమస్యలు తొలగుతాయన్న ఆశాభావం సినీ వర్గాల్లో కనిపిస్తోంది. అందుకే ఇన్నాళ్లు విడుదల విషయంలో స్పష్టత ఇవ్వని అగ్రతారలు సైతం దీపావళి మొదలు సంక్రాంతి(sankranti 2022).. వేసవి సీజన్ల వరకు బెర్తులన్నీ ఖరారు చేసుకున్నారు. ఇప్పటికీ కొన్ని కీలకమైన చిత్రాలు విడుదల తేదీల్ని ప్రకటించలేదు. మరి వాటి అడుగులు ఎటు? ప్రేక్షకుల ముందుకొచ్చేదెప్పుడు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కరోనాతో వాయిదా పడిన వినోదాల్ని వడ్డీ సహా తిరిగి వడ్డించేందుకు సిద్ధమవుతున్నారు అగ్ర కథానాయకుడు వెంకటేశ్. ఇటీవలే 'నారప్ప'గా ఓటీటీ వేదికగా వినోదాలు పంచిచ్చిన ఆయన.. ఇప్పుడు మరో రెండు చిత్రాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వీటిలో 'దృశ్యం 2'(drishyam 2 telugu) చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన తొలి తెలుగు చిత్రమిది. గతంలో వెంకీ - మీనా జంటగా నటించిన క్రైమ్ డ్రామా సినిమా 'దృశ్యం'కు సీక్వెల్‌గా రూపొందింది. దీన్ని ఓటీటీ వేదికగా సినీప్రియుల ముందుకు తీసుకురానున్నట్లు ఆ మధ్య ప్రచారం వినిపించినా.. చిత్ర బృందం నుంచి ఏ ప్రకటన వెలువడలేదు. అయితే ఇప్పుడిది దీపావళి, క్రిస్మస్‌లలో దేన్ని లక్ష్యంగా చేసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. వెంకీ నటిస్తున్న మరో చిత్రం 'ఎఫ్ 3'(f3 movie release date) ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలోనే ఉంది. దీన్ని సంక్రాంతి లక్ష్యంగానే ముస్తాబు చేస్తున్నట్లు అప్పట్లో వెంకీ ప్రకటించారు. అయితే ఇప్పటికే 'రాధేశ్యామ్'(radhe shyam release date), 'భీమ్లా నాయక్'(bheemla nayak release date), 'సర్కారు వారి పాట' సినిమాలు పండగ బరిలో పోటీ పడుతున్న నేపథ్యంలో 'ఎఫ్ 3' ఆ రేసులో నిలుస్తుందా? లేదా? అన్నది అనుమానంగా మారింది.
![.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13402649_movies-1.jpg)
* బాలకృష్ణ, బోయపాటి కలయికలో రూపొందుతోన్న పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'అఖండ'(akhanda release date). 'సింహా', 'లెజెండ్' వంటి హిట్ల తర్వాత బాలయ్య - బోయపాటిల నుంచి వస్తున్న మూడో చిత్రమిది. అందుకే దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. విడుదల తేదీ విషయంలో ఇంత వరకు స్పష్టత ఇవ్వలేదు. దీపావళి బరిలో పోటీ పడనున్నట్లు వార్తలు వినిపించినా.. చిత్ర బృందం ప్రణాళిక మార్చుకున్నట్లు తెలిసింది. నవంబరు నెలాఖరున కానీ, డిసెంబరు తొలివారంలో గానీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై దర్శక నిర్మాతల నుంచి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.
![.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13402649_movies-2.jpg)
* రవితేజ కథానాయకుడిగా రమేశ్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'ఖిలాడి'. విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ సినిమాని ఈ ఏడాదే బాక్సాఫీస్ ముందుకు తీసుకురానున్నట్లు దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే విడుదల తేదీ విషయంలో ఇంత వరకు స్పష్టత ఇవ్వలేదు.
![.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13402649_movies-3.jpg)
* ఇటీవలే 'లవ్‌స్టోరి'తో(love story movie) మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు కథానాయకుడు నాగచైతన్య. ఇప్పుడీ జైత్ర యాత్రను 'థ్యాంక్ యూ'తో(naga chaitanya new movie) కొనసాగించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. విక్రమ్ కె.కుమార్ తెరకెక్కించిన చిత్రమిది. వైవిధ్యభరితమైన ప్రేమకథతో రూపొందింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. డిసెంబరులో బాక్సాఫీస్ ముందుకు రానున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. అయితే ఇప్పటికే 'గని', 'పుష్ప'(pushpa release date), 'శ్యామ్ సింగరాయ్' వంటి చిత్రాలు డిసెంబరు బెర్త్‌లు ఖరారు చేసుకున్న నేపథ్యంలో.. 'థ్యాంక్ యూ'కు సోలో రిలీజ్ డేట్ దొరుకుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
![.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13402649_movies-4.jpg)
* ఈ ఏడాది ఆరంభంలో 'అరణ్య'తో థియేటర్లలో సందడి చేశారు కథానాయకుడు రానా. ఇప్పుడు 'విరాటపర్వం'తో(virata parvam release date) ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. వేణు ఊడుగుల తెరకెక్కించిన ఈ సినిమా.. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకునే పనిలోనే ఉంది. అయితే దీని విడుదల ఎప్పుడనేది ఇంత వరకు తేలలేదు.
![.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13402649_movies-5.jpg)