ఒత్తిడి సామాన్యులకే కాదు... ప్రముఖులకూ ముఖ్యంగా వెండితెరమీద తళుక్కున మెరిసే హీరోహీరోయిన్లకూ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్యులైతే టెన్షన్‌గా ఉందని బయటకు చెప్పేస్తారు. కానీ హీరో హీరోయిన్లు అలా చెప్పుకోలేరు కాబట్టి దాన్నుంచి బయటపడేందుకు తమకు నచ్చిన పనులు చేస్తారట. ఇంతకీ ఆ పనులేంటంటే?
వ్యాయామం చేస్తా
సినిమాల్లో ఫైట్‌సీన్లూ, ఇతర యాక్షన్ సన్నివేశాలూ చేస్తున్నప్పుడు సహజంగానే ఒత్తిడి ఎదురవుతుంది. ఆ ఒత్తిడి పోయి నేను మళ్లీ చురుగ్గా షూటింగ్‌లో పాల్గొనాలి కాబట్టి అప్పటికప్పుడు రిలాక్స్ అయ్యేందుకు ఎక్కడున్నా సరే, వ్యాయామాలు చేస్తా. షూటింగ్ అర్ధరాత్రి పూర్తయినా సరే కాస్త ఒత్తిడిగా అనిపిస్తే ఫిట్‌నెస్ ట్రైనర్ సాయంతో ఒకేసారి వంద స్క్వాట్స్, ఇతర వర్కౌట్లు చేసేస్తుంటా. ఒకవేళ నేను ఇంట్లో ఉంటే.. వ్యాయామాలు చేయడం సహా కాసేపు నేనెంతో ఇష్టంగా కట్టించుకున్న వాలీబాల్ కోర్టులో వాలీబాల్ ఆడతా. ఈ రెండూ కాకుండా స్నేహితులూ, కుటుంబ సభ్యులతోనూ గడిపేందుకు ప్రయత్నిస్తా. అంతేతప్ప ఒత్తిడిని పోగొట్టుకునేందుకు ప్రత్యేకంగా ఏదయినా విహారయాత్రకు మాత్రం వెళ్లాలనుకోను.
పిల్లలు ఉంటే చాలు
ఒక నటుడిగా నేను నటించే సినిమాల్లోని ప్రతి సన్నివేశానికీ వందశాతం న్యాయం చేయాలనుకోవడం సహజమే కాబట్టి... ఒత్తిడి ఎదురవడం మామూలే. అయితే... ఇంటికెళ్లాక నమ్రతతోనూ పిల్లలతోనూ కాసేపు గడిపితే చాలు ఆ ఒత్తిడి ఇట్టే మాయమవుతుంది. ముఖ్యంగా సీతూపాప చెప్పే కబుర్లు వినడం, గౌతమ్‌తో ఏదయినా వీడియోగేమ్ ఆడటం పూర్తయ్యేసరికి నేను రీఛార్జ్ అయిపోతా. ఇంకా విశ్రాంతిని కోరుకుంటే మాత్రం ఓ పుస్తకాన్ని చదవడం మొదలుపెడతా. కాస్త విరామం దొరికినప్పుడు కుటుంబమంతా కలిసి ఎక్కడికైనా వెళ్లడం కూడా మామూలే కాబట్టి.. వీటన్నింటితోనే ఎప్పటికప్పుడు నా పని ఒత్తిడినుంచి బయటపడిపోతుంటా.
పప్పీతో గడుపుతా
ఇంటికి వెళ్లిన వెంటనే నేను చేసే మొదటి పని మా కుక్కపిల్లతో గడపడమే. ఆ సమయంలో ఓ నటుడిగా కాకుండా సాధారణ చరణ్‌లా మారిపోయి... ఆడుకుంటా. దాన్నుంచి వచ్చే పాజిటివ్ వైబ్స్‌తో హాయిగా సేదతీరతా. అందుకే కొన్నిసార్లు షూటింగ్‌లకూ దాన్ని వెంట తీసుకెళ్తుంటా. అదేవిధంగా బాగా అలసటగా అనిపించినప్పుడు ఇంట్లోవాళ్లతో కాసేపు కబుర్లు చెప్పడమూ అలవాటుగా మార్చుకున్నా. ఈ రెండు పనులతో ఎప్పటికప్పుడు రిలాక్స్ అయిపోతా.
యోగా చేస్తా
విరామం లేకుండా షూటింగుల్లో పాల్గొనడం, వ్యాపారం చూసుకోవడం.. ఇలా బ్రేక్ అంటూ లేకుండా పనిచేస్తున్నప్పుడు ఒత్తిడి మామూలే కానీ నేను ఆ సంకేతాలు కనిపించిన వెంటనే వ్యాయామాలు, యోగా, ధ్యానం లాంటి వాటితో ఒత్తిడిని దూరం చేసుకుంటా. ఇంకా స్ట్రెస్ అనిపించినప్పుడు నేనెంతో ఇష్టంగా పెంచుకుంటున్న మా కుక్కపిల్లలతో గడుపుతా. ఒకప్పుడు పెంపుడు జంతువులు ఒత్తిడిని దూరం చేస్తాయని ఎవరైనా చెబితే.. ఎలాగో అర్థమయ్యేది కాదు కానీ ఇప్పుడు వాటితో కాసేపు ఆడుకుంటే చాలు నేనెంత రిలాక్స్ అవుతానో తెలుస్తోంది. మరీ బ్రేక్ తీసుకోవాలనుకుంటే మాత్రం స్నేహితులతో కలిసి సరదాగా ఔటింగ్‌కి వెళ్లేందుకు ప్రయత్నిస్తా.
పాటలు వింటా
నా చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా సరే.. నవ్వుతూ ఉండేందుకే ప్రయత్నిస్తుంటా. అయినప్పటికీ కొన్నిసార్లు తెలియకుండానే ఒత్తిడి తప్పదు. అలాంటప్పుడు నేను ఉండే పరిసరాలను బట్టి ఏం చేయాలనేది ఆలోచిస్తా. మొదట నాకెంతో ఇష్టమైన బీటీఎస్ పాటలు వింటూ కాసేపు డాన్స్ చేసేందుకు సిద్ధమైపోతా. అది కాకపోతే వ్యాయామం చేస్తుంటా. ఈ రెండూ కాకుండా కప్పు ఐస్‌క్రీమ్ లాగించేస్తా. ఇవేవీ పనిచేయనప్పుడూ.. షూటింగ్‌లు లేవనుకున్నప్పుడూ లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లేందుకు ఇష్టపడతాను.
ఇవీ చదవండి:
- స్టార్ హీరో సినిమాకు సమస్య.. థియేటర్ అద్దాలు పగలగొట్టిన ఫ్యాన్స్
- స్పేస్‌లో సినిమా షూటింగ్.. రాకెట్లో వెళ్లిన డైరెక్టర్, హీరోయిన్
- ఆ పాత్రలో నటించడం మరిచిపోలేని అనుభూతి: రకుల్
- Tollywood news: ఓటీటీ నిండుగా.. సినిమా పండగ
- చిరు-చరణ్‌తో 'కేజీఎఫ్' డైరెక్టర్.. సినిమా గురించేనా?
- Mahesh babu new movie: రాజమౌళితో సినిమాపై మహేశ్ క్లారిటీ