ETV Bharat / sitara

ఆ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యా: శివాని రాజశేఖర్

తాను స్టార్​ కిడ్(shivani rajasekhar new movie)​ అయినప్పటికీ ఎన్నో ఒడుదొడుకులు దాటుకొని అవకాశాలు ద్కకించుకున్నట్లు తెలిపింది శివాని రాజశేఖర్​. ఆమె నటించిన 'అద్భుతం' సినిమా ఈ నెల19న విడుదల కానుంది(adbhutham movie teja sajja). ఈ సందర్భంగా చిత్ర విశేషాలు సహా కెరీర్​ గురించి పలు ఆసక్తికర సంగతులను తెలిపింది. అవన్నీ ఆమె మాటల్లోనే..

sivani rajasekhar
శివాని రాజశేఖర్​
author img

By

Published : Nov 15, 2021, 6:43 AM IST

"ఓ సినిమా చేసేటప్పుడు(shivani rajasekhar new movie) మంచి కథ ఉందా.. అందులో నా పాత్ర బాగుందా? అని చూస్తానే తప్ప..బడ్జెట్లు, పారితోషికాలు అసలు పట్టించుకోను" అంటోంది శివాని రాజశేఖర్‌. కథానాయకుడు రాజశేఖర్‌, నటి జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివాని. ఇప్పుడు 'అద్భుతం' చిత్రంతో కథానాయికగా తెరంగేట్రం చేస్తోంది. తేజ సజ్జా(adbhutham movie teja sajja) హీరోగా నటించిన ఈ సినిమాను.. మల్లిక్‌ రామ్‌ తెరకెక్కించారు. ఇది ఈనెల 19న(adbhutam movie 2021 release date) ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలను తెలిపింది శివాని.

"స్టార్‌ కిడ్స్‌కి ఏం సినిమా కష్టాలుంటాయని అందరూ అంటుంటారు. మిగతా వాళ్ల విషయమేమో కానీ, నేను.. నా చెల్లి శివాత్మిక చాలా ఒడుదొడుకులు దాటుకొనే తెరపైకి వచ్చాం. చిన్నప్పటి నుంచి అమ్మానాన్నలతో పరిశ్రమలో తిరగడం వల్ల దర్శక నిర్మాతలతో మంచి పరిచయాలు ఉంటాయి. ఎవరితోనైనా సులభంగా మాట్లాడగలుగుతాం. అదొక్కటే మాకుండే సానుకూలాంశం. అవకాశాలు అందిపుచ్చుకునే విషయంలో అందరిలాగే కష్టపడి నిరూపించుకోక తప్పదు. నేను.. శివాత్మిక చాలా సినిమాలకు ఆడిషన్లు ఇచ్చాం. ఎన్నోసార్లు తిరస్కరణలు ఎదుర్కొన్నాం. అలాంటి ఎన్నో సవాళ్లను దాటుకొనే ఇప్పుడు నా 'అద్భుతం' ప్రేక్షకుల ముందుకొస్తుంది".

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"నిజానికి ఇది నా మూడో చిత్రం. తెలుగులో నేను సంతకం చేసిన తొలి సినిమా 'టూ స్టేట్స్‌' రీమేక్‌. చిత్రీకరణ ప్రారంభమయ్యాక అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. తర్వాత తమిళంలో విష్ణు విశాల్‌తో ఓ సినిమా చేశా. అదీ అనుకోకుండా చిత్రీకరణ దశలోనే ఆగిపోయింది. ఆ సమయంలోనే 'అద్భుతం'(adbhutam movie director) నా చేతికొచ్చింది. ఇది ప్రశాంత్‌ వర్మ రాసిన కథతో రూపొందింది. 'కల్కి' సినిమా చిత్రీకరణ సమయంలో ఆయన నాకీ కథ చెప్పారు. వినగానే నాకు బాగా నచ్చి.. చేస్తానన్నా. తర్వాత దర్శకుడు మల్లిక్‌ రామ్‌ను అడగ్గా.. చిన్న ఆడిషన్‌ చేసి నన్ను తీసుకున్నారు. నేనిందులో వెన్నెల అనే పాత్రలో కనిపిస్తా. నటనకు ఎంతో ప్రాధాన్యమున్న పాత్రిది".

"ట్రైలర్‌ చూసి అందరూ దీన్ని 'ప్లేబ్యాక్‌' సినిమాతో పోల్చుతున్నారు. నిజానికి దానికీ ఈ కథకి ఏమాత్రం పోలికుండదు. సినిమాలో ప్రతి 15నిమిషాలకు ఓ ట్విస్ట్‌ వస్తుంటుంది. కథ ఊహించని విధంగా మలుపు తీసుకుంటుంటుంది. గతేడాది జనవరికే చిత్రీకరణ పూర్తయింది. అదే నెలలో విడుదల చేద్దామనుకున్నాం. నిర్మాణాంతర పనులు ఆలస్యమయ్యాయి. ఈలోపు కొవిడ్‌ వచ్చింది. తొలి లాక్‌డౌన్‌ తర్వాత విడుదల చేద్దామంటే థియేటర్లలో పరిస్థితుల బాగోలేదు. ఈ ఏడాది విడుదల చేద్దామనుకునే సరికి మళ్లీ లాక్‌డౌన్‌ వచ్చింది. దీంతో ఓటీటీ వైపు రావాల్సి వచ్చింది".

"పరిశ్రమ వాళ్లు కదా! ఇలాంటి కథలు వీళ్లు చేస్తారా? గ్లామరస్‌ రోల్స్‌కి అడగొచ్చా? ఇంత చిన్న సినిమా చేస్తారా? ఎక్కువ పారితోషికం అడుగుతారేమో"నని రకరకాలుగా సందేహపడుతుంటారు. నేనిది స్వయంగా తెలుసుకున్న విషయం. నాకు దర్శకత్వం చేయాలన్న కోరికలేదు. నిర్మాణంలో అమ్మనాన్నలకు సహకారం అందిస్తా".

"పరిశ్రమలో బ్యాడ్‌లక్‌, ఐరెన్‌ లెగ్‌ అనే మాటలు తరచూ వింటుంటాం కదా. ఒకానొక సమయంలో నేనలా ఫీలయ్యా. నా తొలి రెండు సినిమాలు చిత్రీకరణ దశలోనే ఆగడం వల్ల.. ఓ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యా. నాకే ఎందుకిలా జరుగుతుంది.. నేనేది మొదలు పెట్టినా ఎందుకు ఆగిపోతుందని బాధగా అనిపించేది. మా ఇంట్లో వాళ్లు సరదాగా 'అందరిలో బిజీగా ఉంది ఇదే.. దీని సినిమా విడుదలవ్వట్లేదు' అనేవాళ్లు. ప్రస్తుతం నేను నటించిన తెలుగు చిత్రం 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు' విడుదలకు సిద్ధమవుతోంది. తమిళంలో ఉదయ్‌నిధి స్టాలిన్‌తో 'ఆర్టికల్‌ 15' రీమేక్‌లో చేస్తున్నా. దీన్ని బోనీ కపూర్‌ సర్‌ నిర్మిస్తున్నారు. హిప్‌హాప్‌ తమిళ్‌ హీరోగా నటిస్తున్న 'అన్‌బరివు'లోనూ నటిస్తున్నా. ఇక మా నిర్మాణంలో నాన్న హీరోగా నటిస్తున్న 'శేఖర్‌' తుది దశ చిత్రీకరణలో ఉంది. థియేటర్ల లభ్యతను బట్టి.. సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నాం".

ఇదీ చూడండి: 'మోస్ట్ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్' ఓటీటీ రిలీజ్ తేదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.