నందమూరి నట వారసుడిగా చిత్రసీమలో అడుగుపెట్టిన తారక రత్న పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు సామాజిక మాధ్యమాల వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

1983లో జన్మించిన తారకరత్న.. 2002లో 'ఒకటో నెంబరు కుర్రాడు' సినిమాతో లవర్‌బాయ్‌గా వెండితెర అరంగేట్రం చేశారు. ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఆయన నటించిన 'యువరత్న', 'తారక్', 'భద్రాద్రి రాముడు' సినిమాలు బాగానే రాణించాయి. అనంతరం రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'అమరావతి' సినిమాలో సైకో విలన్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు. ఈ చిత్రానికి ఉత్తమ విలన్‌గా నంది అవార్డును అందుకున్నారు. అయితే ఆ తర్వాత నటించిన పలు సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
అనంతరం 2016లో 'రాజా చెయ్యి వేస్తే' సినిమాలో స్టైలిష్ విలన్‌గా కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు తారకరత్న. చివరి సారిగా 'నయీం భాయ్' సినిమాలో కనిపించారు. ప్రస్తుతం 'సారథి', 'దేవినేని' సహ పలు చిత్రాల్లో నటిస్తున్నారు.




ఇదీ చూడండి: 'నో ఎగ్జిట్' అంటున్న తారకరత్న, ప్రిన్స్..