ETV Bharat / sitara

వయ్యారాల తమన్నా.. వానలో అలా! - తమన్నా వర్షంలో డ్యాున్స్

మిల్కీ బ్యూటీ తమన్నా వర్షాన్ని ఎంజాయ్ చేసిన వీడియో పోస్ట్​ చేసింది. వాన చినుకుల్లో ప్రకృతితో మమేకమైన ఆ వీడియోను నెట్టింట షేర్ చేసింది.

Tamannaah
తమన్నా
author img

By

Published : Jul 22, 2021, 9:21 PM IST

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల ప్రజాజీవనం స్తంభించిపోయింది. అయితే ఈ వానను ఎంజాయ్ చేస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఓవైపు వర్షం పడుతుంటే ఫొటోలు, వీడియోలకు పోజులిస్తూ సందడి చేసింది. ఈ వీడియోను నెట్టింట పంచుకోగా నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.

"ప్రకృతి ఒడిలో సమయం చాలా సాధారణంగా గడుస్తుంది. పచ్చికపై వట్టి పాదాలతో నడవడం, సీతాకోక చిలకల్ని అందుకునేందుకు ప్రయత్నించడం, భూతల్లితో మమేకమవడం.. ఇవన్నీ మన జీవితాన్ని రీస్టార్ట్ చేస్తాయి" అంటూ వీడియోకు క్యాప్షన్ జోడించింది తమన్నా.

ఇటీవలే రెండు వెబ్​సిరీస్​లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది తమన్నా. హాట్​స్టార్​లో నవంబర్ స్టోరీ, ఆహాలో ఎలెవన్త్ అవర్​తో అలరించింది. ఈ రెండు సిరీస్​లు మంచి ఆదరణ దక్కించుకున్నాయి. గోపీచంద్ సరసన నటించిన సీటీమార్ విడుదలకు సిద్ధంగా ఉంది. నితిన్​తో అంధాధున రీమేక్ మాస్ట్రో, ఎఫ్3 చిత్రీకరణల్లో పాల్గొంటోంది.​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.