ETV Bharat / sitara

మాతృభాష నేర్చుకునే  పనిలో తమన్నా! - మాతృభష నేర్చుకుంటున్న తమన్నా

లాక్​డౌన్​తో ఇంటికే పరిమితమైన తమన్నా.. ఈ ఖాళీ సమయంలో తన తల్లి దగ్గర మాతృభాష 'సింధి' నేర్చకుంటున్నట్లు తెలిపింది. ఈ ఏడాది పూర్తయ్యేసరికి మాతృ భాషలో పూర్తి పట్టు సంపాదించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది.

Taman
తమన్నా
author img

By

Published : May 9, 2020, 8:23 AM IST

లాక్‌డౌన్‌తో ఇంటి దగ్గరే ఉన్న కథానాయిక తమన్నా... తన అమ్మతో కలిసి మాతృభాష సింధి నేర్చుకుంటున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

"అమ్మ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలని ఉండేది. వాళ్ల నైపుణ్యాలు, విజ్ఞానం నా తర్వాతి తరాలకు అందించాల్సి ఉంది. కానీ సినిమాలతో తీరిక దొరక్క సాధ్యపడలేదు. ఈ లాక్‌డౌన్‌తో ఆ తీరిక దొరికింది. నాకు మా మాతృభాష సింధి అంతగా రాదు. నా మాతృభాష కన్నా తెలుగు, తమిళ భాషలు చక్కగా మాట్లాడతా. మరి నాకే నా సొంత భాష రానప్పడు నా తర్వాతి తరానికి దాన్ని ఎలా అందించగలుగుతా. అందుకే అమ్మ దగ్గర సింధి నేర్చుకుంటున్నా. లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి తనని ఇంట్లో నాతో సింధిలోనే మాట్లాడుతుండమని చెప్పాను. ఈ ఏడాది తిరిగే సరికి నా మాతృ భాషలో పూర్తి పట్టు సంపాదించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఇంటి పనుల్లోనూ అమ్మ నుంచి చిట్కాలు తెలుసుకుంటున్నా"

-తమన్నా, కథానాయిక.

ప్రస్తుతం పలు దక్షిణాది చిత్రాల్లో నటిస్తోంది ఈ భామ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.