ETV Bharat / sitara

మీ రాక కోసం ఆత్మీయులు ఎదురు చూస్తారు: ఎన్టీఆర్‌ - ఎన్టీఆర్​ వార్తలు

ఇంటి నుంచి బయటకి వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకోవాలని ప్రముఖ సినీ హీరో ఎన్టీఆర్‌ అన్నారు. బయటకి వెళ్లిన వారి రాక కోసం తల్లిదంద్రులు, భార్య, పిల్లలు ఎదురు చూస్తారని గుర్తు పెట్టుకోవాలని కోరారు. రోడ్డు ప్రమాదాల్లో తాను ఇద్దరు ఆత్మీయులను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

talihudu hero ntrs speak about traffic rules in hyderabad
మీ రాక కోసం ఎదురు చూస్తారు: ఎన్టీఆర్‌
author img

By

Published : Feb 17, 2021, 1:36 PM IST

Updated : Feb 17, 2021, 3:41 PM IST

మీ రాక కోసం ఆత్మీయులు ఎదురు చూస్తారు: ఎన్టీఆర్‌

వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు విధిగా పాటించాలని ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. గచ్చిబౌలిలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా వార్షిక సదస్సుకు హాజరై... బీజాపూర్​ హైవేలో పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించారు. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఎన్నో ప్రమాదాలు పొంచి ఉండే అవకాశం ఉన్నందున... మరింత అప్రమత్తత అవసరమన్నారు. బయటకు వెళ్లేటప్పుడు ఇంట్లో వారిని గుర్తు తెచ్చుకోవాలని తారక్‌ సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో తనకిష్టమైన ఇద్దరు... అన్నయ్య జానకీరామ్‌, తండ్రి హరికృష్ణను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల చేతిలో ఉన్న లాఠీ మనల్ని దండించడానికి కాదని సన్మార్గంలో నడిపించడానికేనని గుర్తించాలన్నారు.

మీ రాక కోసం ఎదురు చూస్తారు: ఎన్టీఆర్‌

గత మూడు సంవత్సరాలలో సైబరాబాద్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు చాలా తగ్గాయని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్ తెలిపారు. వేరే ప్రాంతం వాళ్లు సైబరాబాద్ పరిధిలోకి రావాలంటే నియమాలు తప్పక పాటించాలనే భయం కలిగిందని సీపీ స్పష్టం చేశారు. ఇందుకు తమ ట్రాఫిక్ పోలీసుల కృషే కారణమని అభినందించారు. ప్రతి ప్రమాదానికి ఒక ఎస్‌ఐ స్థాయి అధికారితో దర్యాప్తు చేయిస్తున్నట్లు వివరించారు. ప్రమాదం చేసి పారిపోయే కేసులను చాలా ఛేదించినట్లు పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన కూడా కల్పించడం, ట్రాఫిక్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి 10వేల మందికి హెల్మెట్లు ఇప్పించినట్లు తెలిపారు

ఇదీ చదవండి: 'స్వరాష్ట్ర కలను సాకారం చేసిన యోధుడు కేసీఆర్'

Last Updated : Feb 17, 2021, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.