ETV Bharat / sitara

'దిల్‌ బెచారా' నుంచి మరో ప్రేమగీతం - సుశాంత్ సింగ్ రాజ్​పుత్ దిల్ బెచారా

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్ చివరి చిత్రం 'దిల్ బెచారా'. ఈ సినిమాలోని మరో పాటను విడుదల చేసింది చిత్రబృందం. 'తారే జిన్' అంటూ సాగే ఈ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది.

'దిల్‌ బెచారా' నుంచి మరో ప్రేమగీతం
'దిల్‌ బెచారా' నుంచి మరో ప్రేమగీతం
author img

By

Published : Jul 15, 2020, 5:42 PM IST

బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్​పుత్‌ చివరిసారిగా నటించిన చిత్రం 'దిల్‌ బెచారా'. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు పాటలు విడుదలై ప్రేక్షకుల్ని అలరించాయి. సంజనా సంఘీ కథానాయిక. తాజాగా ఈ మూవీలోని మరో పాటను విడుదల చేసింది చిత్రబృందం. "జబ్సే హువా హై యే అచ్చా సా లగ్తా హై.. దిల్ హో గయా ఫిర్ సే బచ్చా సా లగ్తా హై.." అంటూ సాగే సాంగ్ ఆకట్టుకుంటోంది.

అమిత్‌ భట్టాచార్య సాహిత్యం, మోహిత్ చౌహాన్, శ్రేయా ఘోషల్ అందమైన గొంతుకు తోడు ఏ.ఆర్‌.రెహ్మన్‌ అందించిన సంగీత స్వరాలు కొత్త అనుభూతిని పంచుతున్నాయి. ఈ అందమైన ప్రేమ పాట యువ ప్రేమికులకు కొంగొత్త అనుభూతులను పంచేలా ఉందని చెప్పవచ్చు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

2014లో హాలీవుడ్‌లో విడుదలైన రొమాంటిక్‌ డ్రామా 'ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌' చిత్రానికి రీమేక్‌గా 'దిల్‌ బెచారా నిర్మితమైంది. ముఖేష్‌ ఛబ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ట్రైలర్‌ ఇటీవలే విడుదలై కేవలం 24 గంటల్లోనే 20 మిలియన్‌ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. ఈనెల 24న హాట్‌స్టార్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.