ETV Bharat / sitara

సుశాంత్​ మృతిపై అధ్యయనానికి ​డాక్టర్ల బృందం

బాలీవుడ్​ దివంగత నటుడు సుశాంత్​ శవపరీక్ష నివేదికను అధ్యయనం చేయడానికి ఐదుగురు వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది ఆల్​ఇండియా ఇనిస్టిట్యూట్​ ఫర్​ మెడికల్​ సైన్సెస్​ (ఎయిమ్స్​). హీరో మృతికి సంబంధించిన పోస్టుమార్టమ్ నివేదికతో పాటు మరణానికి కారణమైన అంశాలను ఈ బృందం అధ్యయనం చేస్తుందని ఎయిమ్స్​ ఫోరెన్సిక్​ విభాగాధిపతి సుధీర్​ గుప్తా పేర్కొన్నారు.

Sushant was poisoned and autopsy forcibly delayed, alleges Swamy
సుశాంత్​ మృతిపై అధ్యయనానికి ఎయిమ్స్​ బృందం ఏర్పాటు
author img

By

Published : Aug 25, 2020, 2:20 PM IST

సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ పోస్టుమార్టం నివేదికను అధ్యయనం చేయడానికి ఐదుగురు వైద్యులతో.. ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది ఆల్​ఇండియా ఇనిస్టిట్యూట్​ ఫర్​ మెడికల్​ సైన్సెస్​ (ఎయిమ్స్​). దీంతో పాటు హీరో మృతికి గల కారణాలను ఆ బృందం పరిశీలించనుందని తెలిపింది. ఈ అధ్యయనంలో భాగంగా ఫోరెన్సిక్​ అధారాలతో పాటు శవపరీక్షకు సంబంధించిన పత్రాలు, వీడియోలను కమిటీకి అందించింది సీబీఐ.

"సీబీఐ అభ్యర్థన మేరకు మెడికల్​ బోర్డును ఏర్పాటు చేశాం. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బోర్డు.. సుశాంత్​ శవపరీక్ష నివేదికను పరిశీలించి హత్య కోణంలోనూ అధ్యయనం చేస్తారు. మా బృందం సీబీఐ నుంచి పత్రాలను, వీడియోలను అందుకుంది. ప్రస్తుతం మేము వాటిని పరిశీలిస్తున్నాం. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత తుది నివేదిక వెల్లడిస్తాం".

-సుధీర్​ గుప్తా, ఎయిమ్స్​ ఫోరెన్సిక్​ విభాగాధిపతి

త్వరలోనే తను ముంబయి వెళ్లి, సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తానని సుధీర్​ గుప్తా వెల్లడించారు. జూన్​ 15న సుశాంత్​ పోస్టుమార్టం చేసిన కూపర్​ ఆస్పత్రి.. శవపరీక్ష నివేదికలో మరణించిన సమయం రాయకపోవడం గురించి గుప్తా ప్రశ్నలు లేవనెత్తారు. కొద్ది రోజుల్లోనే సీబీఐ, ఎయిమ్స్​ కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

విషప్రయోగం జరిగింది!

సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ మరణానికి ముందు హీరోకు విషప్రయోగం జరిగిందని భా.జ.పా రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య​ స్వామి ఆరోపించారు. అందుకే అతడి శవపరీక్షను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని.. దాంతో ఆ విషం జీర్ణద్రవాల ద్వారా కరిగిందని మంగళవారం ట్విట్టర్​లో వెల్లడించారు.

  • Now the diabolical mentality of the killers and their reach is being slowly revealed: autopsy was deliberately forcibly delayed so that the poisons in SSR’s stomach dissolves beyond recognition by the digestive fluids in the stomach . Time to nail those who are responsible

    — Subramanian Swamy (@Swamy39) August 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సుశాంత్​ స్నేహితురాలు రియా చక్రవర్తిని కస్టోడియల్​ ఇన్వెస్టిగేషన్​ చేయాలని సోమవారం సామాజిక మాధ్యమాల్లో డిమాండ్​ చేశారు స్వామి. సుశాంత్​ మరణానికి ముందు జూన్​ 8న దర్శకుడు మహేశ్​ భట్, రియాల మధ్య జరిగిన వాట్సప్​ సంభాషణపై స్పందించిన సుబ్రహ్మణ్య స్వామి.. రియా, సుశాంత్​ విడిపోవడానికి మహేశ్​భట్​ కారణమనేది చాటింగ్​ ద్వారా తెలుస్తోందని అన్నారు.

సుశాంత్​ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన కూపర్​ ఆస్పత్రి వైద్యులను విచారించాలని డిమాండ్​ చేస్తూ.. నెటిజన్లు ట్విట్టర్​లో హ్యాష్​ట్యాగ్​ను ట్రెండ్​ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.