ETV Bharat / sitara

హాలీవుడ్​ చిత్రానికి పోటీగా.. సుశాంత్ 'దిల్​ బేచారా' వసూళ్లు - దిల్​ బేచారా కలెక్షన్

దివంగత నటుడు సుశాంత్​సింగ్ రాజ్​పుత్​ నటించిన చివరి చిత్రం 'దిల్​ బేచారా'కు విదేశాల్లోనూ విశేషాదరణ లభిస్తోంది. ఫిజి, న్యూజిలాండ్ దేశాల్లో​ హాలీవుడ్​ చిత్రమైన 'టెనెట్​'కు పోటీగా వసూళ్లు రాబడుతోందని సినీవిశ్లేకులు తెలిపారు.

Sushant Singh Rajput's 'Dil Bechara' Competes With 'Tenet' In New Zealand And Fiji
హాలీవుడ్​ చిత్రానికి పోటీగా సుశాంత్ చిత్రం వసూళ్లు
author img

By

Published : Sep 8, 2020, 8:22 AM IST

బాలీవుడ్‌ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నటించిన చివరి చిత్రం 'దిల్‌ బేచారా'. సంజనా సంఘీ, సైఫ్‌ అలీఖాన్‌, షాహిల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ముఖేశ్‌ చబ్రా దర్శకుడు. ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందించారు. లాక్‌డౌన్‌ కారణంగా భారత్‌ థియేటర్లు మూతపడం వల్ల.. ఓటీటీ వేదికగా హాట్​స్టార్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందింది.

'టెనెట్​'కు పోటీగా వసూళ్లు

న్యూజిలాండ్‌, ఫిజిలో థియేటర్లలోనే విడుదలైన సుశాంత్​ చిత్రానికి విశేష స్పందన లభిస్తోంది. విదేశాల్లో బాక్సాఫీసు వద్ద సినిమా సత్తా చాటింది. హాలీవుడ్‌ దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ తీసిన 'టెనెట్‌'కు పోటీగా నిలిచి.. భారీ వసూళ్లు సాధిస్తోందని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ పేర్కొన్నారు. తక్కువ స్క్రీన్లపై, తక్కువ షోలు వేసినప్పటికీ సినిమా న్యూజిల్యాండ్‌లో 48,436 డాలర్లు, ఫిజిలో 33,864 డాలర్లు సాధించినట్లు చెప్పారు. విదేశాల్లో చిత్రానికి అద్భుతమైన స్పందన లభించిందని ట్వీట్‌ చేశారు.

మేకింగ్​ వీడియో

జూన్‌ 14న సుశాంత్‌ ఆత్మహత్య చేసుకొని అందర్నీ షాక్‌కు గురి చేశారు. ఆయన మృతి పట్ల అనుమానాలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు కేసు నమోదు చేశారు. మరోపక్క ఆదివారంతో (సెప్టెంబరు 6) 'చిచ్చోరే' సినిమా విడుదలై ఏడాదైన సందర్భంగా కథానాయిక శ్రద్ధా కపూర్‌ సుశాంత్‌ను గుర్తు చేసుకున్నారు. మేకింగ్‌ వీడియో షేర్‌ చూస్తూ.. నటుడ్ని మిస్‌ అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.