ETV Bharat / sitara

సుశాంత్ కేసులో ఐదుగురు కీలక సాక్షుల గుర్తింపు - రియా చక్రవర్తి

సుశాంత్ రాజ్​పుత్ ఆత్మహత్య కేసులో ఐదుగురు కీలక సాక్షులను గుర్తించింది సీబీఐ. అతడు సూసైడ్ చేసుకున్న ఘటనా స్థలంలో ఉన్న రియా చక్రవర్తి, మీతూ సింగ్, సిద్ధార్థ్ పితాని, శామ్యూల్ మిరండాతో పాటు మరో వ్యక్తి నుంచి కీలక సమాచారం సేకరించేందుకు సిద్ధమైంది.

సుశాంత్ కేసులో ఐదుగురు కీలక సాక్షుల గుర్తింపు

author img

By

Published : Aug 11, 2020, 8:22 PM IST

Updated : Aug 11, 2020, 9:29 PM IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్య కేసు విచారణ వేగవంతం చేస్తోంది సీబీఐ. ఈ క్రమంలో ఐదుగురు కీలక సాక్షులను గుర్తించింది. ఇందులో సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి, అతడి సోదరి మీతూ సింగ్, ఫ్లాట్​లోని స్నేహితుడు సిద్ధార్థ్ పితాని, ఫ్లాట్ మేనేజర్ శామ్యూల్ మిరండాతో పాటు మరో వ్యక్తిపై నిఘా ఉంచింది. వీరందరూ సుశాంత్​ సూసైడ్ చేసుకున్న రోజు అక్కడే ఉన్నారు. పోలీసుల కంటే ముందుగానే వీరు ఘటనా స్థలంలో కనిపించారు. అలాగే పోలీసులు రాకముందే మృతదేహాన్ని ఎందుకు కిందకు దించారనే విషయంపై క్లారిటీ కోసం వీరి నుంచి సమాచారం సేకరించే పనిలో పడింది సీబీఐ.

ఈ కేసు విషయంలో మొత్తం 56 మందికి సంబంధం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్డు విచారణలో ఉంది. తన కుమారుడి ఆత్మహత్యకు న్యాయం జరగాలని కేకే సింగ్​ బిహార్ పట్నా పోలీసు స్టేషన్​లో కేసు నమోదు చేశారు. రియా చక్రవర్తి కుటుబంపై కేసు పెట్టారు. దీనిపై ముంబయి పోలీసుల నుంచి సమాచారం సేకరించారు పట్నా పోలీసులు. అలాగే ఈ ఆత్మహత్య కేసును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రాన్ని కోరారు. దీనికి అంగీకారం తెలిపిన కేంద్రం ఆగస్టు 6న ఈ కేసును సీబీఐకి అప్పగించింది.

అలాగే రియా చక్రవర్తి కుటుంబం, సుశాంత్ మేనేజర్ శ్రుతి మోదీ, అతడి స్సేహితుడు సిద్ధార్థ్ పితానిపై ఈడీ విచారణ కొనసాగుతోంది. మనీ ల్యాండరింగ్ విషయమై వీరిని ప్రశ్నిస్తోంది ఈడీ. ఈరోజు కూడా శ్రుతి, సిద్ధార్థ్​తో పాటు సుశాంత్ సోదరి మితూ సింగ్​ను విచారించింది.

రిజర్వ్​లో రియా పిటిషన్

సుశాంత్ కేసు విషయమై ముంబయి పోలీసులు విచారణ జరుపుతుండగా.. పట్నాలో అతడి తండ్రి కేకే సింగ్ కేసు పెట్టారు. తన కుమారుడిది ఆత్మహత్య కాదని హత్య అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. రియా కుటుంబంతో పాటు శ్రుతి మోదీ, సిద్ధార్థ్ పితానీలను నేరస్థులంటూ ఆరోపించారు. అయితే ఈ కేసును సవాలు చేస్తూ రియా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ముందు ఎన్నికలు ఉన్నందు వల్ల ఈ కేసును బిహార్ ప్రభుత్వం సంచలనం చేయాలని చూస్తోందని ఆరోపించింది. సుశాంత్ సూసైడ్ విషయంలో తనపై అనవసరంగా నిందలు వేస్తున్నారని వెల్లడించింది. తాజాగా ఈ పిటిషన్​పై సుశాంత్ తండ్రి, పట్నా,ముంబయి పోలీసుల నుంచి వివరణ కోరిన సుప్రీం.. ఈరోజు పిటిషన్​ను రిజర్వ్​లో పెడుతున్నట్లు వెల్లడించింది. ఆమె అభ్యర్థనపై ఆగస్టు 13న విచారించనుంది.

Last Updated : Aug 11, 2020, 9:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.