ఈ సంక్రాంతికి రెండు వేర్వేరు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, సంగీత దర్శకుడు తమన్. త్వరలో తీయబోయే కొత్త సినిమా కోసం వీరిద్దరూ కలిసి పని చేయనున్నారని సమాచారం. ఇంతకు ముందు తమన్.. మహేశ్ 'దూకుడు', 'బిజినెస్‌మేన్', 'ఆగడు' చిత్రాలకు స్వరాలందించాడు. ఇప్పుడు ప్రిన్స్‌తో మరోసారి స్టెప్పులేయించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
'అల వైకుంఠపురములో..' సినిమాతో బన్నీకి మ్యూజికల్ హిట్ ఇచ్చాడు తమన్. మరి మహేశ్‌కు ఏ రేంజ్లో పాటలు ఇస్తాడో? అని అభిమానులు అప్పుడే మాట్లాడుకుంటున్నారు.
మహేశ్‌బాబు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తర్వాతి ప్రాజెక్టు చేయనున్నాడు. దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. ఈ కాంబో.. ఇంతకు ముందు 'మహర్షి'తో విజయాన్ని అందుకుంది.
ఇదీ చదవండి: మహేశ్ మాటిచ్చాడు.. డ్యాన్స్ కుమ్మేశాడు