ETV Bharat / sitara

సుమంత్ 'కపటధారి' రివ్యూ: ఆ హత్యలు చేసిందెవరు?

మర్డర్ మిస్టరీగా తెరకెక్కిన 'కపటధారి' థియేటర్లలో విడుదలైంది. ఆద్యంతం ఆసక్తితో సాగిన ఈ సినిమా.. ప్రేక్షకులకు నచ్చిందా? ఇందులోని మెచ్చే అంశాలేంటి?

sumanth kapatadhaari movie telugu review
సుమంత్ కపటధారి మూవీ రివ్యూ
author img

By

Published : Feb 19, 2021, 10:30 AM IST

చిత్రం: కపటధారి

న‌టీన‌టులు: సుమంత్‌, నందిత‌, నాజ‌ర్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, సంప‌త్ త‌దిత‌రులు

నిర్మాత‌: ల‌లిత ధ‌నుంజ‌య‌న్‌

ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి

విడుద‌ల‌: 19-02-2021

తెలుగులోకి త‌మిళం, మ‌ల‌యాళం నుంచే కాదు... అప్పుడ‌ప్పుడు క‌న్న‌డ నుంచి కూడా క‌థ‌లు దిగుమ‌తి అవుతుంటాయి. అక్క‌డ 'కావలుధారి'గా తెరకెక్కి విజ‌యాన్ని అందుకున్న థ్రిల్ల‌ర్ చిత్రం తెలుగులో 'క‌ప‌ట‌ధారి'గా రీమేకైంది. క‌థాబ‌ల‌మున్న చిత్రాలు చేసే సుమంత్ క‌థానాయ‌కుడిగా న‌టించడం... ప్ర‌చార చిత్రాలు ఆస‌క్తి రేకెత్తించ‌డం వల్ల సినిమాపై మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి. మరి చిత్రం ఎలా ఉంది? పోలీస్‌ ఆఫీసర్‌గా సుమన్‌ ఎలా నటించాడు? ఏ కేసును ఛేదించాడు?

sumanth kapatadhaari movie telugu review
సుమంత్ కపటధారి సినిమా సమీక్ష

క‌థేంటంటే: గౌత‌మ్ (సుమంత్) ట్రాఫిక్ పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. అత‌నికి క్రైమ్ విభాగంలోకి వెళ్లాల‌నేది క‌ల‌. కానీ, పై అధికారి అందుకు ఒప్పుకోడు. అసంతృప్తిగానే విధులు నిర్వ‌ర్తిస్తున్న అత‌ని ప‌రిధిలోనే ఓ కుటుంబానికి చెందిన అస్తిపంజరాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి. అవి 40 ఏళ్ల కింద‌ట జ‌రిగిన హ‌త్య‌ల‌ని తేలుతుంది. క్రైమ్ విభాగానికి చెందిన పోలీసులు ఆ కేసును మూసివేసే ఆలోచ‌న‌లో ఉండ‌గా, గౌత‌మ్ ఆ హ‌త్య‌‌ల వెన‌క నిజాల్ని నిగ్గు తేల్చేందుకు స్వ‌యంగా ప‌రిశోధ‌న మొద‌లు పెడ‌తాడు. ఆ క్ర‌మంలో అతనికి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? ఇంత‌కీ ఆ హ‌త్య‌ల్ని ఎవ‌రు చేశారు? గౌత‌మ్ హంత‌కుల్ని ప‌ట్టుకున్నాడా? క్రైమ్ విభాగంలోకి వెళ్లాల‌న్న ఆయ‌న క‌ల తీరిందా? త‌దిత‌ర విషయాల్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే?: ఓ హ‌త్య జ‌రుగుతుంది. దాని వెనుక ఎవ‌రున్నార‌న్న‌ది మాత్రం అంతుచిక్క‌దు. క్లూ కూడా దొర‌క‌దు. చిన్న అనుమానం. ఆ తీగని ప‌ట్టుకుని లాగుదాం అనుకునేలోపే అనుకోని అవాంత‌రాలు. ఊహించ‌ని రీతిలో కొత్త కోణాలు బ‌య‌ట పడుతూ కేస్ మ‌రింత క్లిష్ట‌త‌రంగా మారుతుంటుంది. ఏం జ‌ర‌గ‌బోతోందా అనే ఉత్కంఠ మొద‌ల‌వుతుంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థ‌లంటే దాదాపుగా ఇదే త‌ర‌హాలోనే సాగుతుంటాయి. ఈ క‌థ కూడా ఆ తాను ముక్కే. కానీ, ఇందులో హ‌త్య‌లు అప్పుడెప్పుడో 40 ఏళ్ల క్రితం జ‌రిగినవి. ఆధారాలే కాదు, మ‌నుషులు.. ప‌రిస్థితులు అన్నీ మారిపోతాయి. అలాంటి ఓ క్లిష్ట‌మైన కేస్‌ను త‌న భుజాల‌పై వేసుకుంటాడు క‌థానాయ‌కుడు. అత‌నికి అడుగ‌డుగునా ఎదురయ్యే స‌వాళ్లే ఈ సినిమాకు కీల‌కం. ఓ ట్రాఫిక్ ఇన్‌స్పెక్ట‌ర్ క్రైమ్ కేసును ఛేదించ‌డం అనేది ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మే. అందుకే క‌థానాయ‌కుడు క్రైమ్ సీన్‌లోకి అడుగుపెట్ట‌గానే ఈ కేస్‌ను ఎక్క‌డ మొద‌లు పెడ‌తాడ‌నే అంశం ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తుంది.

లాక‌ప్ న్యూస్ జ‌ర్న‌లిస్ట్ జీకే (జ‌య‌ప్ర‌కాష్‌)తో క‌లిసి ప‌రిశోధించ‌డం మొద‌లు పెడ‌తాడు గౌత‌మ్‌. ఆ త‌ర్వాత కొన్ని ద‌శాబ్దాల కింద‌ట ఈ కేస్‌ను డీల్ చేసిన పోలీస్ అధికారి రంజిత్ (నాజ‌ర్‌) తోడ‌వుతాడు. రంజిత్ రాక‌తోనే క‌థలో వేగం పుంజుకుంటుంది. గౌత‌మ్ సేక‌రించే ఆధారాలు కొన్ని, అప్ప‌ట్లో రంజిత్ ప‌రిశోధ‌న‌లో వెలుగులోకి తెచ్చిన విష‌యాలు మ‌రికొన్నింటిని క‌లిపి కేస్‌ను ప‌లు కోణాల్లో ప‌రిశోధించ‌డం మొద‌లుపెడ‌తాడు. అస‌లు ర‌హ‌స్యం క‌థానాయిక ర‌మ్య ద్వారా బ‌య‌ట ప‌డుతుంద‌నేలోపే మ‌రో మ‌లుపు. ఇలా చివ‌రి వ‌ర‌కూ క‌థ‌లో మ‌లుపులే. 'కావ‌లుధారి' క‌థ‌లో ఎలాంటి మార్పులు చేయ‌కుండా తెలుగులో తీశారు కానీ... అక్క‌డి స్థాయిలో భావోద్వేగాలు మాత్రం పండ‌లేదు. ప్ర‌థ‌మార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం ప‌ర్వాలేద‌నిపిస్తుంది. సినిమాలో కొన్ని స‌న్నివేశాలు మాత్ర‌మే థ్రిల్‌ను పంచుతాయి. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థ‌ల్లో క‌నిపించే వేగం ఇందులో తగ్గింది. ప‌తాక స‌న్నివేశాలు ప‌ర్వాలేద‌నిపిస్తాయి. క‌థ‌నంలో బిగి కొర‌వ‌డింది. చాలా స‌న్నివేశాలు సాగ‌దీత‌గా అనిపిస్తాయి.

ఎవ‌రెలా చేశారంటే?: క‌థానాయ‌కుడు సుమంత్ పోలీస్ పాత్ర‌లో ఒదిగిపోయాడు. కానీ, ఆ పాత్ర‌ను తీర్చిదిద్దిన విధానంలో లోపాలు క‌నిపిస్తాయి. థ్రిల్ల‌ర్ సినిమాల్లో క‌థానాయ‌కుడి పాత్రలు గాఢ‌త‌తో కూడుకుని ఉంటాయి. ఇందులో ఆ గాఢ‌త సుమంత్ పాత్ర‌లో కానీ, న‌ట‌నలో కానీ, క‌నిపించ‌లేదు. నాజ‌ర్‌, జ‌య‌ప్ర‌కాష్ అనుభ‌వం ఈ సినిమాకి ప‌నికొచ్చింది. పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. క‌థానాయిక పాత్ర‌కు ప్రాధాన్యం లేదు. వెన్నెల కిషోర్ ప్ర‌థ‌మార్ధంలో కొన్ని చోట్ల న‌వ్వించారు. సాంకేతికంగా సినిమా ప‌ర్వాలేద‌నిపిస్తుంది. సంగీతం, కెమెరా విభాగాలు చ‌క్క‌టి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. నిర్మాణంలో ప‌రిమితులు క‌నిపిస్తాయి. దర్శ‌కుడు ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి ప‌నిత‌నం కొన్నిచోట్లే క‌నిపిస్తుంది. క‌థ‌లో బోలెడ‌న్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న‌ప్ప‌టికీ అక్క‌డ‌క్క‌డ మాత్ర‌మే ప‌ట్టుని ప్ర‌ద‌ర్శించారు. చాలా చోట్ల సినిమా నిదానంగా సాగుతుంది.

బ‌లాలు

+ క‌థలో మ‌లుపులు

+ నేపథ్య సంగీతం

+ ప‌తాక స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు

- ప్ర‌థ‌మార్థం

- నిదానంగా సాగే స‌న్నివేశాలు

చివ‌రిగా: 'క‌ప‌ట‌ధారి' మలుపులు బాగున్నాయి. థ్రిల్లింగ్‌గా ఉంటే ఇంకాస్త బాగుండేది.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.