యాంకర్ సుమ పేరు వినగానే మనకు ముందుగా గుర్తోచ్చేది వాక్చాతుర్యం. ఆమెను తెలుగు హీరోల అభిమానులంతా మెచ్చుకుంటుంటారు. ఎవరిని నొప్పించని మనస్తత్వం సుమది. అచ్చమైన తెలుగు కావాలంటే సుమ యాంకరింగ్ చూడాల్సిందే!
తాజాగా సుమ తన భర్త రాజీవ్ కనకాలతో కలిసున్న ఓ ఫొటోను తన ట్విట్టర్లో షేర్ చేసింది. అంతేకాదు ఆ చిత్రానికి 'మై డియర్ రాజా.. ఎప్పటికీ నా సంతోషం నీవే' అంటూ భర్తపై ప్రేమను ఇలా తెలిపింది. ఫొటోలో రాజీవ్ భుజాలపై వాలి, కనులు మూసుకుని భర్త చేయి పట్టుకుని తన్మయత్వంతో ఉంది సుమ. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
-
My dearest raja , my ❤️ , oneness and happiness forever #Rajeevkanakala pic.twitter.com/rxSqffqulm
— Suma Kanakala (@ItsSumaKanakala) September 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">My dearest raja , my ❤️ , oneness and happiness forever #Rajeevkanakala pic.twitter.com/rxSqffqulm
— Suma Kanakala (@ItsSumaKanakala) September 14, 2020My dearest raja , my ❤️ , oneness and happiness forever #Rajeevkanakala pic.twitter.com/rxSqffqulm
— Suma Kanakala (@ItsSumaKanakala) September 14, 2020
సుమ, రాజీవ్ కనకాల విడాకుల వార్తలు ఈ మధ్య బాగా వైరల్‌గా మారాయి. ఈ ఇద్దరి మధ్య విభేదాల కారణంగా విడిపోతున్నారంటూ గాసిప్స్ వచ్చాయి. సుమ,రాజీవ్‌తో ఎలాంటి సంబంధాలను కొనసాగించడం లేదంటూ పుకార్లు షికార్లు చేశాయి.
ఈ పుకార్లకు ఈటీవీలో ప్రసారమౌతున్న క్యాష్ ప్రోగ్రామ్‌తో చెక్ పెట్టింది సుమ. భర్త రాజీవ్‌తో కలిసి వాళ్లు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో తెలిసేలా చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">