ETV Bharat / sitara

సోనూ నిగమ్​పై దివ్యా ఖోస్లా మీటూ ఆరోపణలు

చిత్ర పరిశ్రమలో ఎలా అయితే బంధుప్రీతి ఉందో సంగీత పరిశ్రమలోనూ అలాంటి పరిస్థితులే ఉన్నాయంటూ ఆరోపించాడు సింగర్​ సోనూ నిగమ్​. అదే విధంగా టీ-సిరీస్​ అధినేత భూషణ్​ కుమార్​పై కొన్ని ఆరోపణలు చేశాడు. దీనిపై తాజాగా భూషణ్​ కుమార్​ భార్య, నటి దివ్యా ఖోస్లా ఇన్​స్టాగ్రామ్​లో స్పందించింది. సోనూ.. కనీసం కృతజ్ఞతా భావం లేకుండా వ్యవహరిస్తున్నాడని ఓ వీడియో ద్వారా తెలిపింది.

Stop inciting people against T-Series: Divya Khosla Kumar hits back at Sonu Nigam
'సోనూ నిగమ్​కు కనీస కృతజ్ఞతా భావమైనా లేదు'
author img

By

Published : Jun 25, 2020, 4:48 PM IST

టీ-సిరీస్​ అధినేత భూషణ్​ కుమార్​.. తన గౌరవాన్ని దెబ్బ తీస్తున్నాడని ఆరోపిస్తూ ఇటీవలే ఓ వీడియోను విడుదల చేశాడు గాయకుడు సోనూ నిగమ్​. భారతీయ సంగీత పరిశ్రమలో మ్యూజిక్​ మాఫియా రాజ్యమేలుతోందని వెల్లడించాడు. దీనిపై తాజాగా భూషణ్​ కుమర్​ భార్య, నటి దివ్యా ఖోస్లా కుమార్ ఇన్​స్టాగ్రామ్​లో​ స్పందించింది.

సోనూ నిగమ్​ వ్యాఖ్యలపై దివ్యాఖోస్లా స్పందన

"మీరు (సోనూ నిగమ్​) గొప్ప గాయకులు. అలాంటి మీరు ఎంతమందికి అవకాశాన్ని ఇచ్చారు. ఎవరికీ ఇవ్వలేదు. కానీ, టీ-సిరీస్​లో 97 శాతం మంది చిత్రపరిశ్రమకు చెందిన వారు కాకుండా బయటి వాళ్లే ఉన్నారు. మీలో ఉన్న ప్రతిభను చూసి గుల్షన్​​ కుమార్​ మీకు అవకాశాన్ని ఇచ్చారు. గుల్షన్​ కుమార్​ మరణం తర్వాత టీ-సిరీస్​ మునిగిపోతుందన్న సందేహంతో మరో సంగీత సంస్థతో మీరు ఒప్పందం కుదుర్చున్నారు. మీకు కనీస కృతజ్ఞతా భావమైనా లేదు".

- దివ్యా ఖోస్లా, బాలీవుడ్​ నటి

టీ-సిరీస్ అధినేత భూషణ్​ కుమార్​పై వస్తోన్న లైంగిక ఆరోపణలపై కూడా స్పందించింది దివ్య. ఆ ఆరోపణలు అన్నీ కల్పితమని స్పష్టం చేసింది. ​"మీటూ అంటే ఏమిటి సోనూ. నేనూ నిన్ను రేపిస్ట్ అని చెప్పాలా ? మీరూ మీటూలో భాగస్వామి​ అని అనాలా? లేదా మీరే రేపిస్ట్​గా మారతారా?" అని ఇన్​స్టాగ్రామ్​ వీడియోలో తెలిపింది దివ్యా ఖోస్లా.

ఇదీ చూడండి... ఆ సినిమాకు సీక్వెల్ చేస్తే అది నయనతారతోనే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.