బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్‌ను హత్య చేశారనే ఆరోపణను తోసిపుచ్చుతూ, ఎయిమ్స్ ఫోరెన్సిక్ ప్యానెల్ ఇటీవలే సీబీఐకి నివేదిక సమర్పించింది. దీనిని సుశాంత్ కుటుంబసభ్యుల న్యాయవాదుల బృందం తప్పుబట్టింది. ఈ క్రమంలోనే న్యాయవాది వరుణ్‌సింగ్, సీబీఐ డైరెక్టర్ రిషీ కుమార్ శుక్లాకు లేఖ రాశారు.
"సుశాంత్ మృతి కేసులో ఎయిమ్స్ బృందం సీబీఐకి సమర్పించిన నివేదిక అంటూ మీడియాలో వస్తున్న కథనాలను చూశాను. ఆ బృందంలోని కొందరు వైద్యులు టీవీలో వస్తున్న ఫోరెన్సిక్ పరీక్షకు సంబంధించిన ప్రకటనలు చేయడాన్ని నేను చూశాను. నివేదిక కోసం మేం చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఎయిమ్స్ బోర్డు అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా నుంచి ఎలాంటి స్పందనలేదు. దీంతో ఎయిమ్స్ అభిప్రాయానికి సంబంధించిన వార్తా నివేదిక సరైనదేనని నేను ఈ లేఖ రాస్తున్నాను. ఇలాంటి సున్నితమైన కేసులో ఎయిమ్స్ బృందానికి అధ్యక్షత వహించిన డాక్టర్ సుధీర్ గుప్తా మొదటిరోజు నుంచే దీని గురించి ఇంటర్వ్యూలు ఇస్తూ.. అనైతికంగా ప్రవర్తించారు. వృత్తిపరమైన నియమాలను కాకుండా ప్రభుత్వ సేవాప్రవర్తన నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించారు. ఇలాంటి చర్యలు ఎయిమ్స్ లాంటి సంస్థలపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీశాయి. దర్యాప్తుపై ఎంతోమంది ప్రజల మనస్సులలో సందేహాలను సృష్టించాయి. వారి నివేదిక మరణానికి గల కారణాన్ని మాత్రమే చెబుతుంది. కానీ, అది హత్యకాదు అని ఎలా నిర్ణయిస్తారు"
- వరుణ్ సింగ్, సుశాంత్ కుటుంబసభ్యుల తరపు న్యాయవాది
సుశాంత్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ చేసిన కూపర్ ఆస్పత్రి ఇచ్చిన నివేదికతో పాటు అక్కడి వైద్యులను ప్రశ్నించడం తప్ప.. ఫోరెన్సిక్ బృందం శవపరీక్షలో ప్రత్యక్షంగా పాల్గొనలేదని వరుణ్ సింగ్ అన్నారు. హత్య జరగలేదని స్పష్టం చేసిన ఎయిమ్స్ బృందం.. కనీసం సుశాంత్ మృతదేహాన్ని పరిశీలించకుండా ఆ విషయాన్ని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. ఇలాంటి అవకతవకలపై సీబీఐ ఆరా తీయాలని లేఖలో సూచించారు.
![SSR family's lawyer writes to CBI, questions AIIMS' 'faulty' report](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9082334_s.png)
![SSR family's lawyer writes to CBI, questions AIIMS' 'faulty' report](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9082334_ss.png)
![SSR family's lawyer writes to CBI, questions AIIMS' 'faulty' report](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9082334_ssr.png)