'మగధీర' 100 మందిని చంపే సీన్- 15 ఏళ్ల క్రితమే.. - రాజమౌళి ఇంటర్వ్యూ
స్టార్ డైరెక్టర్ రాజమౌళి 'మగధీర' సినిమాలో 100 మందిని చంపే సీన్ వెనక పెద్ద కథే ఉంది? ఆ విషయాన్ని స్వయంగా రాజమౌళీనే ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇంతకీ ఏంటా విషయం?
ఎస్.ఎస్.రాజమౌళి.. ఈ పేరు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే 'బాహుబలి'కి ముందు మనకు మాత్రమే తెలిసిన ఈయన.. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినిమాల సత్తా చాటడమే కాకుండా స్టార్ హీరోలతో సమానంగా ఇమేజ్ సొంతం చేసుకున్నారు.
ఇప్పటివరకు రాజమౌళి 11 సినిమాలు తీస్తే, అందులో కనీసం ఒక్కటంటే ఒక్కడి కూడా ప్లాఫ్ కాలేదు. దీన్ని బట్టే ఆయన స్టామినా ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే సినిమాలతో రాజమౌళి హిట్లు, బ్లాక్బస్టర్లు కొట్టే విషయంలో కథారచయిత, తన తండ్రి విజయేంద్రప్రసాద్ స్థానం ప్రత్యేకం. ఆయన అద్భుతంగా స్టోరీ రాస్తే, దానిని అంతకంటే అద్భుతంగా తెరకెక్కించి, ప్రేక్షకులను ఊహాలోకంలో విహరించేలా చేసేవారు రాజమౌళి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వీరి కాంబినేషన్లో వచ్చిన రామ్‌చరణ్- 'మగధీర' అయితే అప్పట్లో టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. అందులో 100 మందిని చంపే సీన్ ఇప్పుడు చూసినా సరే రొమాలు నిక్కబొడుచుకోవడం(గూస్బంప్స్) ఖాయం. గతంలో ఈటీవీ యువభారత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రాజమౌళి ఈ సినిమా గురించిన ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
'మగధీర'లో కాలభైరవ(రామ్‌చరణ్), 100 మందిని చంపే సీన్ అల్టిమేట్. అప్పటివరకు వచ్చిన సినిమాల్లోకెల్లా ది బెస్ట్‌గా నిలిచింది. అయితే అంతకు 15 ఏళ్ల క్రితమే తన తండ్రి, ఈ సీన్‌ను రాశారని రాజమౌళి 2011లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దానిని పట్టుకొని ఓ డైరెక్టర్ దగ్గరకు వెళ్తే ఇలాంటివి ఎవరు చూస్తారంటూ మాట్లాడారని అన్నారు. తానే దర్శకుడుగా మారిన కొన్నాళ్లకు ఆ కథను 'మగధీర'గా తెరకెక్కించినట్లు చెప్పారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
400 ఏళ్ల క్రితం చనిపోయిన కాలభైరవ- మిత్రవింద.. మళ్లీ పుట్టి ఎలా ఒక్కటయ్యారు అనే కథతో 'మగధీర' తీశారు. మెగాహీరో రామ్‌చరణ్, కాజల్ హీరోహీరోయిన్లుగా చేశారు. కీరవాణి అందించిన సంగీతం, పాటలు.. ఇప్పటికే ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటాయి! ఈ సినిమా విడుదలై శుక్రవారానికి(జులై 30) 12 ఏళ్లు.