ETV Bharat / sitara

కేరళ విద్యార్థినికి 'షారూక్ ఖాన్​'​ స్కాలర్​షిప్​ - షారూక్​ ఖాన్​ స్కాలర్​షిప్​

కేరళకు చెందిన మహిళా యువ పరిశోధకురాలు గోపిక... లా ట్రోబ్ విశ్వవిద్యాలయం అందించే 'షారూఖ్ ఖాన్' పీహెచ్‌డీ స్కాలర్‌షిప్​కు ఎంపికైంది. ముంబయి వేదికగా బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో బాలీవుడ్​ నటుడు షారుఖ్​.. ఆమెకు స్కాలర్​షిప్​ పత్రాన్ని ప్రదానం చేశాడు.

SRK to support a young researcher's dream
కేరళ పరిశోధకురాలికి షారూక్​ లా ట్రోబ్​ స్కాలర్​షిప్​
author img

By

Published : Feb 27, 2020, 11:54 AM IST

Updated : Mar 2, 2020, 5:47 PM IST

ఆస్ట్రేలియాలోని ప్రముఖ లా ట్రోబ్​ విశ్వవిద్యాలయం... పీహెచ్​డీ పరిశోధనల్లో కృషి చేస్తోన్న విద్యార్థులకు ప్రతి ఏటా స్కాలర్​షిప్​ ఇస్తోంది. గతేడాది దీన్ని షారూక్​ పేరు మీదకు మార్చి... 'షారుఖ్​ఖాన్​ లా ట్రోబ్ యూనివర్సిటీ పీహెచ్‌డీ స్కాలర్‌షిప్‌'గా పిలుస్తున్నారు. కేరళకు చెందిన యువ మహిళా పరిశోధకురాలు గోపిక.. ఈ ఏడాది ఈ ఆర్థిక సాయానికి ఎంపికైంది. తాజాగా జరిగిన ఓ వేడుకలో ఆ విద్యార్థినికి ప్రశంసాపత్రం, స్కాలర్​షిప్​ను అందించాడు బాలీవుడ్​ బాద్షా.

" గోపిక అంకితభావాన్ని, నిర్ణయాలను నేను గౌరవిస్తాను. ఈ స్కాలర్‌షిప్​తో ఆమె మెల్​బోర్న్​లో లా ట్రోబ్‌ యూనివర్సిటీలో చదివేందుకు వీలు కలుగుతుంది. తను భారతదేశ వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచాలన్న కలను ఈ అవకాశం ద్వారా నిజం చేసుకుంటుందని ఆశిస్తున్నాను."

- షారూక్​ ఖాన్​, కథానాయకుడు

కేరళలోని త్రిస్సూర్​కు చెందిన గోపిక కొట్టంతరాయిల్ భాసి.. జంతు శాస్త్రం, జీవావరణ శాస్త్రం, పరమాణు అధ్యయనాలతో వ్యవసాయ పద్ధతులపై పరిశోధనలు చేస్తోంది. 800 వందల మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా.. అత్యుత్తమ ప్రతిభ ఆధారంగా ఈమెకు అవకాశం దక్కింది. ఈ స్కాలర్​షిప్​లో గోపిక నాలుగేళ్లు ఆర్థిక సాయం పొందనుంది.

SRK to support a young researcher's dream
కేరళ పరిశోధకురాలికి షారూక్​ లా ట్రోబ్​ స్కాలర్​షిప్​
ఇదీ చూడండి.. అత్యాచారం వల్లే బయటకు రాలేకపోయా: పాప్​ గాయని

Last Updated : Mar 2, 2020, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.