ETV Bharat / sitara

ఓటీటీల్లో మరో రెండు భారీ చిత్రాలు - sooryavanshi release date

భారీ వ్యయంతో తెరకెక్కిన 'సూర్యవంశీ', '83' సినిమాలు కూడా ఓటీటీలవైపు చూస్తున్నాయి. థియేటర్ల తెరిచేదానిపై ఈ విషయం ఆధారపడి ఉందని తెలుస్తోంది.

ఓటీటీల్లో మరో రెండు భారీ చిత్రాలు
సూర్యవంశీ- 83 సినిమాలు
author img

By

Published : Aug 22, 2020, 8:11 PM IST

బాలీవుడ్​ భారీ చిత్రాలు 'సూర్యవంశీ', '83'.. ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ విషయాన్ని రిలయన్స్ ఎంటర్​టైన్​మెంట్స్ గ్రూప్స్ సీఈఓ శిబాశిష్ సర్కార్ ట్వీట్ చేశారు. అన్ని అవకాశాలు పరిశీలిస్తున్నామని, థియేటర్ల తెరవకపోతే ప్రత్యామ్నాయలపై దృష్టిసారిస్తామని అన్నారు.

Reliance Entertainment Group CEO Shibashish Sarkar
రిలయన్స్ ఎంటర్​టైన్​మెంట్స్ గ్రూప్స్ సీఈఓ శిబాశిష్ సర్కార్

కరోనా వ్యాప్తి కారణంగా మన దేశంలో మార్చి నుంచి థియేటర్లను మూసేశారు. అన్​లాక్ ప్రక్రియ మొదలైనా సరే వాటిని తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో పలువురు దర్శక నిర్మాతలు ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. 'సడక్ 2', 'లక్ష్మీబాంబ్', 'భుజ్' తదితర సినిమాలు డిజిటల్​గానే విడుదల కానున్నాయి. ఇప్పుడు అదే బాటలో 'సూర్యవంశీ', '83' కూడా వెళ్లనున్నాయి.

akshay kumar
సూర్యవంశీ సినిమాలో అక్షయ్ కుమార్

హీరో అక్షయ్ కుమార్- దర్శకుడు రోహిత్ శెట్టి కాంబినేషన్​లో, కాప్ యూనివర్స్​లో వస్తున్న మూడో సినిమా 'సూర్యవంశీ'. తొలుత మార్చి 24నే విడుదల చేయాలనుకున్నారు. కరోనా ప్రభావం కారణంగా అదికాస్త వాయిదా పడుతూ వచ్చింది. అనంతరం ఇప్పుడు దీపావళికి ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.

83 cinema
83 సినిమాలో రణ్​వీర్ సింగ్

1983 ప్రపంచకప్​ నేపథ్య కథతో కపిల్​దేవ్ జీవితం ఆధారంగా తీసిన సినిమా '83'. రణ్​వీర్ సింగ్, దీపికా పదుకొణె హీరోహీరోయిన్లు. ఏప్రిల్ 10నే రావాల్సింది కానీ కరోనా వల్ల వాయిదా పడింది. ఈ ఏడాది క్రిస్​మస్​కు చిత్రాన్ని తీసుకొస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.