ETV Bharat / sitara

'కర్రసాము చేసిన బామ్మతో స్కూల్‌ పెట్టిస్తా' - రితేష్ దేశ్​ముఖ్​ వార్తలు

లాక్​డౌన్ కారణంగా చాలామంది ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారు. పుణెకు చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు ఆజీమా కూడా ఇలాంటి కష్టాన్నే ఎదుర్కొంది. తనకు తెలిసి విద్యను వీధుల్లో ప్రదర్శించి సాయం కోరదామని నిశ్చయించుకుంది. అయితే ఆమె కర్ర సాము చేస్తోన్న వీడియోను కొందరు నెట్టింట ఉంచగా అదికాస్త నటులు సోనూసూద్, రితేశ్ దేశ్​ముఖ్​ కంటపడింది. వెంటనే స్పందించిన వారు ఆమె వివరాలు తెలపాలని కోరారు.

http://10'ఆ బామ్మ స్ఫూర్తి ఆదర్శం.. వివరాలు తెలిస్తే పంపండి'.10.50.70:6060///finalout1/urdu-nle/finalout/24-July-2020/8159794_kkkk.JPG
'ఆ బామ్మ స్ఫూర్తి ఆదర్శం.. వివరాలు తెలిస్తే పంపండి'
author img

By

Published : Jul 24, 2020, 8:23 PM IST

ఈ ప్రపంచంలో అందరికీ అతి పెద్ద శత్రువు ఆకలి. దాన్ని జయించడానికి నిత్యం మనిషి పోరాటం చేస్తూనే ఉంటాడు. 'కోటి విద్యలు కూటి కొరకే' అన్న మాట అక్షర సత్యం అని చెబుతోంది ఈ 85 ఏళ్ల వృద్ధురాలు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా చాలా మంది పేదలకు కుటుంబ పోషణ భారమైంది. పుణెకు చెందిన ఆజీమా కూడా ఇలాంటి కష్టాన్నే ఎదుర్కొంది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో తనకు తెలిసిన కొద్దిపాటి విద్యను వీధుల్లో ప్రదర్శించి సాయం కోరదామని నిశ్చయించుకుంది. ఇంకేముంది తనకు తెలిసిన కర్రసామును సాధన చేస్తూ 'చేతనైన సాయం చేయండి' అంటూ అర్థించడం మొదలు పెట్టింది.

85ఏళ్ల వయసులోనూ ఆమె కర్రసాము చేస్తున్న తీరును వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం వల్ల అది కాస్తా వైరల్‌ అయింది. ఈ వయసులోనూ ఆమె కర్రసాము చేస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ‘ఈ వృద్ధురాలు ఎవరు’ అంటూ అన్వేషణ ప్రారంభమైంది. అలా వీడియోను చూసిన నటులు సోనూ సూద్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్‌లు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. ఆమె వివరాలు తెలపాలని నెటిజన్లను కోరారు.

  • लठैत दादी की जय हो, कई के पसीने छुड़ा देगी 😀🙏🏻 pic.twitter.com/UpeLpPkirY

    — Dadi Chandro Tomar (@realshooterdadi) July 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దీనిపై నటుడు సోనూ సూద్‌ స్పందిస్తూ.. "ఈ వృద్ధురాలి వివరాలు నాకు తెలియజేయండి. ఆమెతో ఒక శిక్షణా పాఠశాలను ప్రారంభిస్తా. దేశంలోని మహిళల ఆత్మరక్షణకు అవసరమైన శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తా" అని ట్వీట్‌ చేశారు. మరో నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌ కూడా ఆమె వివరాలను కోరారు. దీంతో స్పందించిన కొందరు నెటిజన్లు ఆమె వివరాలను రితేశ్‌కు పంపగా, "ధన్యవాదాలు ఎంతో స్ఫూర్తిదాయకమైన ఈ యోధురాలు ఆజీమా వివరాలు తెలిశాయి" అని పేర్కొన్నారు.

'కర్రసాము చేసిన బామ్మతో స్కూల్‌ పెట్టిస్తా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.