ETV Bharat / sitara

ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న వార్తలపై సోనమ్ స్పందన - cinema news

బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్.. విమానశ్రయాల్లో భారత ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలను మెచ్చుకుంది. తను ప్రెగ్నెన్సీ వార్తల గురించి మాట్లాడింది.

ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న వార్తలపై సోనమ్ స్పందన
హీరోయిన్ సోనమ్ కపూర్
author img

By

Published : Mar 20, 2020, 5:42 PM IST

Updated : Mar 20, 2020, 6:16 PM IST

ఇటీవలే లండన్​ నుంచి తిరిగొచ్చిన హీరోయిన్ సోనమ్ కపూర్.. అభిమానులతో ఇన్​స్టాగ్రామ్​ లైవ్​లో ముచ్చటించింది. దిల్లీ విమానశ్రయంలో కరోనా స్క్రీనింగ్​ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలను మెచ్చకుంది. తన ప్రెగ్నెన్సీ విషయంలో వస్తున్న వార్తలపైనా స్పందించింది.

ఈ మధ్య కాలంలో కొత్త ప్రాజెక్టులను సోనమ్ ఒప్పుకోలేదు. దీంతో ఈమె తల్లి కాబోతుందని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఈ విషయంపై స్పందించిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతానికి తను ప్రెగ్నెంట్​ కాదని, ఒకవేళ అలా జరిగితే తప్పకుండా చెబుతానంది.

ఇటీవలే భర్త ఆనంద్​తో లండన్​ వెళ్లి వచ్చిన సోనమ్.. అక్కడి ఎయిర్​పోర్ట్​లో కరోనా విషయంలో కనీస జాగ్రత్తలు పాటించకపోవడం చూసి కంగుతిన్నానని చెప్పింది. అదే సమయంలో భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించింది. 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉంటున్నట్లు ఇన్​స్టా వేదికగా స్పష్టం చేసింది.

అదే విధంగా ఇప్పటికీ కొందరు నటీనటులు షూటింగ్​లకు వెళుతున్నారని చెప్పింది సోనమ్. వారు ఇంత బాధ్యతారహితంగా ఎలా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్నింటికన్నా ఆరోగ్యం ముఖ్యమని స్పష్టం చేసింది.

Last Updated : Mar 20, 2020, 6:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.