ETV Bharat / sitara

ఎన్టీఆర్​ సినిమాతో మళ్లీ తెరపైకి సోనాలీ బింద్రే! - ఎన్టీఆర్​ సినిమాతో సోనాలీ బింద్రే రీ ఎంట్రీ

Koratala NTR movie Sonali bendre: వెండితెరపై అగ్రనటిగా రాణించి.. గ్లామర్​తో కుర్రకారును ఫిదా చేసిన నటి సోనాలీ బింద్రే. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ కొరటాల శివ-ఎన్టీఆర్​ కాంబోలో తెరకెక్కనున్న చిత్రంతో రీఎంట్రీ ఇవ్వనుందని తెలిసింది.

sonali bendre reentry with NTR Koratala movie
ఎన్టీఆర్​ సినిమాతో మళ్లీ తెరపైకి సోనాలీ బింద్రే
author img

By

Published : Mar 14, 2022, 9:14 AM IST

Koratala NTR movie Sonali bendre: 'మురారి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్​ సోనాలీ బింద్రే. తొలి సినిమాతో అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత 'ఖడ్గం', 'మన్మథుడు', 'ఇంద్ర' వంటి పలు సూపర్​ హిట్​ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని చిత్రాలకు దూరమైంది. అనంతరం క్యాన్సర్​ బారిన పడటం, చికిత్స తీసుకొని కోలుకోవడం జరిగింది.

ఇప్పుడు దాదాపు 18ఏళ్ల తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. తారక్​-కొరటాల శివ కాంబోలో తెరకెక్కనున్న చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ఆమెను సంప్రాదించారట! పాన్​ ఇండియా ప్రాజెక్ట్​ అవ్వడం, కథ నచ్చడం వల్ల ఆమె కూడా దీనికి గ్నీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.

ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, నందమూరి కల్యాణ్‌రామ్‌ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్‌ మిక్కిలినేని నిర్మాతగా వ్యవహరించనున్నారు.

కబడ్డీ ఛాంపియన్​గా ఎన్టీఆర్​

కాగా, ఎన్టీఆర్‌.. కొరటాల శివ చిత్రంతో పాటు ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సానాతో కూడా మరో సినిమా చేయనున్నారని కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది. వచ్చే నెల 11న అధికారికంగా ప్రకటన వెలువడనుందనేది పరిశ్రమ వర్గాలు మాట. క్రీడా నేపథ్యంలో సాగే ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కబడ్డీ ఛాంపియన్‌గా కనిపించనున్నారు. కోచ్‌గానూ ఆయన తెరపై సందడి చేయనున్నారని తెలిసింది. 'పెద్ది' అనే వర్కింగ్‌ టైటిల్‌తో పట్టాలెక్కనున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ ప్రత్యేకంగా సన్నద్ధం కానున్నట్టు తెలిసింది. దీనిపై చిత్రబృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది.

ఇదీ చూడండి: కమల్​హాసన్​ 'విక్రమ్' రిలీజ్​ డేట్​ ఫిక్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.