పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్స్, హీరోయిజంతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలు తెరకెక్కిస్తుంటారు దర్శకుడు పూరీ జగన్నాథ్. కథకు తగ్గట్టుగా ఆయన పెట్టే టైటిల్స్‌కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. డాషింగ్ టైటిల్స్‌తో అభిమానులకు కిక్ ఇవ్వడం పూరీకి అలవాటు. తాజాగా విజయ్ దేవరకొండతో తెరకెక్కిస్తోన్న కొత్త చిత్రానికి 'లైగర్' అనే టైటిల్ ఖరారు చేశారు. అయితే పూరీ.. తాను దర్శకత్వం వహించిన పలు చిత్రాలకు మొదట ఒక టైటిల్ అనుకుని తర్వాత పలు కారణాలు వల్ల వాటిని మార్చారు. అవేంటో చూద్దాం.
లైగర్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లైగర్'. అయితే ఈ సినిమాకు మొదట 'ఫైటర్' అనే టైటిల్‌ను అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. పరిశీలనాత్మక టైటిల్గానూ ఈ పేరు ప్రాచూర్యంలోకి వచ్చింది. కానీ అనూహ్యంగా ఈ టైటిల్‌ను 'లైగర్'గా మార్చారు. ('లైగర్' అంటే మగసింహం, ఆడపులికి జన్మించిన సంకరజాతి సంతానం అని అర్థం)
-
Humbly announcing our arrival Pan India!
— Vijay Deverakonda (@TheDeverakonda) January 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Nation wide madness Guaranteed.
Produced by @KaranJohar @DharmaMovies @Charmmeofficial @PuriConnects
A @purijagan Film!#LIGER#SaalaCrossBreed pic.twitter.com/GWrLKuLrJu
">Humbly announcing our arrival Pan India!
— Vijay Deverakonda (@TheDeverakonda) January 18, 2021
Nation wide madness Guaranteed.
Produced by @KaranJohar @DharmaMovies @Charmmeofficial @PuriConnects
A @purijagan Film!#LIGER#SaalaCrossBreed pic.twitter.com/GWrLKuLrJuHumbly announcing our arrival Pan India!
— Vijay Deverakonda (@TheDeverakonda) January 18, 2021
Nation wide madness Guaranteed.
Produced by @KaranJohar @DharmaMovies @Charmmeofficial @PuriConnects
A @purijagan Film!#LIGER#SaalaCrossBreed pic.twitter.com/GWrLKuLrJu
చిరుత
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన చిత్రం 'చిరుత'. అయితే ఈ సినిమాకు మొదట 'కుర్రాడు' అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. 'లో క్లాస్ ఏరియా' ఉపశీర్షిక. అయితే చిరు తనయుడు అనే అర్థం వచ్చేట్టుగా 'చిరుత' అనే పేరును ఫైనల్ చేశారు. ఈ టైటిల్‌కు మంచి స్పందన లభించింది.
బద్రి
పవన్‌కల్యాణ్ కెరీర్‌లో ఓ హిట్ చిత్రం 'బద్రి'. రేణూ దేశాయ్, అమీషా పటేల్ కథానాయికలుగా తెరకెక్కిన ఈ చిత్రానికి మొదట 'చెలి' అనే పేరు పెట్టాలనుకున్నారు. కానీ ఆ పేరు మరీ క్లాస్‌గా ఉందని స్నేహితులు చెప్పడం వల్ల టైటిల్ మార్చి 'బద్రి' అని పెట్టారు. ఇందులో 'నువ్వు నందా అయితే నేను బద్రి, బద్రీనాథ్' అంటూ పవన్ చెప్పిన డైలాగ్.. టైటిల్‌ను పవర్‌ఫుల్‌గా మార్చేసింది.
ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం
రవితేజ - పూరీజగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన క్లాసిక్ లవ్ స్టోరీ 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం'. ఈ చిత్రానికి మొదట 'జీవితం' అనే పేరు పెట్టాలనుకున్నారు. పూరీ కెరీర్‌లో ఇదో క్లాసిక్ టైటిల్‌గా మిగిలిపోయింది.
ఆంధ్రావాలా
తారక్-పూరీ కాంబినేషన్‌లో విడుదలైన చిత్రం 'ఆంధ్రావాలా'. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకి మొదట 'కబ్జా' అని టైటిల్ అనుకున్నారు.
పోకిరి
మహేశ్‌బాబు కథానాయకుడిగా పూరీజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం 'పోకిరి' అయితే ఈ చిత్రానికి మొదట 'ఉత్తమ్ సింగ్' అనే టైటిల్ అనుకున్నారు. ఇందులో మహేశ్ ఆటిట్యూడ్‌కు తగ్గట్లు 'పోకిరి' టైటిల్ ఉండటం వల్ల సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.