ETV Bharat / sitara

రజనీ, విజయ్​లను అధిగమించిన శివకార్తికేయన్​ - shivakartikeyan movie latest news updates

కోలీవుడ్​ మాస్​ హీరో శివ కార్తికేయన్​ సామాజిక మాధ్యమాల వేదికగా అరుదైన ఘనత సాధించాడు. ట్విట్టర్​లో 6 మిలియన్ల ఫాలోవర్స్​ను సంపాదించుకుని అగ్ర కథానాయకులను పక్కకు నెట్టేశాడు.

Sivakarthikeyan OVERTAKES top Kollywood superstars Rajinikanth and Vijay Sethupathi; Here's how
శివకార్తికేయన్
author img

By

Published : Jul 13, 2020, 8:42 PM IST

కోలీవుడ్​లో అశేష అభిమానులను సొంతం చేసుకున్న హీరోల్లో శివకార్తికేయన్​ ఒకరు. తమిళ్​ రియాలిటీ షోలో కంటెస్టెంట్​గా తన కెరీర్​ను మొదలుపెట్టి... ఆ తర్వాత యాంకర్​ అయ్యాడు. మెల్లగా ఆవకాశాలు రావడం వల్ల సినిమాల్లో చిన్న పాత్రలను చేస్తూ.. ప్రస్తుతం మాస్​ హీరోగా గుర్తింపు పొందాడు. తాజాగా, ఈ హీరో​ ట్విట్టర్​లో అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటివరకు 6 మిలియన్ల మంది ఫాలోవర్స్​ను సొంతం చేసుకుని.. రజినీకాంత్​, విజయ్​ సేతుపతిలను పక్కకు నెట్టాడు. ఈ నేపథ్యంలోనే ఇంతటి ఘనతను కారణమైన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.

  • Thanks and loads of love to all the 6 million friends in Twitter 🙏👍Special thanks to all my brothers and sisters for ur unconditional love and support ❤️🤗 pic.twitter.com/XrS5zgKQHU

    — Sivakarthikeyan (@Siva_Kartikeyan) July 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కోలీవుడ్​లో అత్యధిక ఫాలోవర్స్​ కలిగిన హీరో ధనుష్​. ట్విట్టర్​లో 9 మిలియన్లకు పైగా అభిమానులు ధనుష్​ను అనుసరిస్తున్నారు. మరోవైపు కమల్​హాసన్​కు 7 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక రజనీ కాంత్​ను 5.7 మిలియన్ల అభిమానులు అనుసరిస్తుండగా.. విజయ్​ సేతుపతికి 1 మిలియన్​ ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరినీ అధిగమించాడు శివకార్తికేయన్​.

ప్రస్తుతం శివకార్తికేయన్​ 'డాక్టర్'​ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి తాజా అప్​డేట్​ సోమవారం రాత్రి ప్రకటించనున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. మూవీని ఓటీటీ ప్లాట్ ​ఫామ్​లో విడుదల చేస్తారని చెప్పనున్నట్లు సమాచారం. మరోవైపు సైన్స్ ​ఫిక్షన్​ నేపథ్యంలో తెరకెక్కున్న 'అయలాన్'​ అనే చిత్రంలోనూ కనిపించనున్నాడీ హీరో.

ఇదీ చూడండి:మాలీవుడ్ వెంటపడుతున్న టాలీవుడ్.. ఎందుకు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.