ETV Bharat / sitara

గాయని సునీత పేరు చెప్పి మోసం చేస్తున్న వ్యక్తి

author img

By

Published : Jul 28, 2020, 2:05 PM IST

తన పేరు చెప్పి మోసం చేస్తున్న చైతన్య అనే వ్యక్తిని నమ్మొద్దని కోరారు గాయని సునీత. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని అన్నారు.

గాయని సునీత పేరుతో మోసం చేస్తున్న వ్యక్తి
గాయని సునీత

తన పేరు, తన కుటుంబసభ్యుల పేరుతో ఇతరులను మోసం చేస్తూ డబ్బులు గుంజుతున్న చైతన్య అనే వ్యక్తిని నమ్మొద్దని ప్రముఖ గాయని సునీత కోరారు. అలాంటి వ్యక్తి తన కంట పడితే దేహశుద్ధి తప్పదని హెచ్చరించారు. ఇలాంటి వాటివల్లే ఎంతోమంది అమాయకులు మోసపోతున్నారని స్పష్టం చేశారు. ప్రముఖుల పేరు చెప్పి మోసం చేసే వారి వలలో ఎలా పడతారని ప్రశ్నించిన సునీత... తన పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంచినా నమ్మొద్దని అన్నారు. చైతన్య విషయంలో చాలా మంది మోసపోయారని వెల్లడించారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు.

మోసం చేస్తున్న వ్యక్తి గురించి చెబుతున్న గాయని సునీత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.