టాలీవుడ్‌లో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో మధురమైన పాటలు పాడిన ప్రముఖ గాయని సునీత.. ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించారు. వ్యాపారవేత్త రామ్‌ను ఇటీవల వివాహం చేసుకున్న ఈమె.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్, వివాహానంతర జీవితం గురించి చెప్పారు.
"గులాబి'లోని 'ఈ వేళలో నీవు' పాట నాకెంతగానో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ పాట తర్వాత తెలుగులో నాకు కొన్ని సినిమా ఆఫర్స్ వచ్చాయి. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ 'అనగనగా ఒక రోజు'లో అవకాశమిచ్చారు. ఎస్వీ కృష్ణారెడ్డి నా కెరీర్ ప్రారంభంలో ఛాన్స్లిచ్చారు. కానీ, నాకు నటన పట్ల ఆసక్తి లేదు. అందుకే వచ్చిన అవకాశాలను సున్నితంగా తిరస్కరించాను. ఇండస్ట్రీలో ఎందరో హీరోయిన్స్ కష్టాలను కళ్లారా చూశాను. వాళ్లకు ఎదురైన పరిస్థితుల్లో నా జీవితాన్ని ఊహించుకుంటే నాకెంతో భయవేసింది. అందుకే నటన ఎప్పుడూ ప్రయత్నించలేదు. ప్రస్తుతానికి నా జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంది. దానిని అలాగే ఉంచాలనుకుంటున్నాను' అని సునీత తెలిపారు.