ప్రముఖ గాయని సునీత.. పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా పసుపు రాసుకుని, మెహందీ వేసుకున్న తర్వాత తన పిల్లలతో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో అభిమానులకు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలానే మెహందీతో సునీత ఉన్న వీడియోను రేణు దేశాయ్ ఇన్‌స్టాలో పంచుకున్నారు.
ఇప్పటికే పెళ్లి చేసుకుని, విడాకులు తీసుకున్న సునీత.. పిల్లలతో కలిసి ఉంటున్నారు. అయితే తాను మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నానని డిసెంబరు 7న ప్రకటించారు. ప్రముఖ వ్యాపారవేత్త రామ్‌ను పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపారు.
ఇది చదవండి: సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీలో రేణు దేశాయ్,సుమ