బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేదికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌మీడియాలో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో స్వీయనిర్బంధంలో ఉన్నట్లు పేర్కొన్నారు.
"కొవిడ్ టెస్ట్‌లో వైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతానికి నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. స్వీయ నిర్బంధంలో ఉన్నా" అని సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు.
రణ్వీర్ సింగ్, ఆలియా భట్ కలిసి నటించిన 'గల్లీబాయ్' కీలకపాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు సిద్ధాంత్ చతుర్వేది. ప్రస్తుతం 'భూత్ పోలీస్' షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇందులో ఇషాన్ ఖత్తర్‌తో పాటు కత్రినా కైఫ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. 'బంటీ ఔర్ బబ్లీ' సీక్వెల్లోనూ నటించనున్నారు.
ఇదీ చూడండి: ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైన 'సూర్యవంశీ'