ఈ ఫొటోలో అబ్బాయి రూపంలో ఉన్న హీరోయిన్ను గుర్తుపట్టారా?.. నటి అబ్బాయిగా మారడం ఏంటి అనుకుంటున్నారా..! ఇదంతా జెండర్ స్వాప్ ప్రభావం. ఇంతకీ ఈ నటి ఎవరో తెలుసా?.. విలక్షణ నటుడు కమల్ హాసన్ కుమార్తెగా చిత్ర పరిశ్రమకు పరిచయమై అగ్ర నటిగా ఎదిగిన శ్రుతిహాసన్. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆమె ముంబయిలోని తన ఇంట్లోనే ఉంటున్నారు. ఇంటిపనితో పాటు తన సంగీత కళల్ని మెరుగుపరుచుకునే పనిలో పడ్డారు. తన విశేషాలు చెబుతూ.. సోషల్‌మీడియా వేదికగా అభిమానులకు చేరువలో ఉంటున్నారు.
![Shruti Haasan shared her fans with Gender Swap photo](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7756975_413_7756975_1593013529613.png)
తాజాగా ఆమె తన ముఖాన్ని అబ్బాయి, బామ్మ రూపాల్లో మార్చి షేర్ చేశారు. యువకుడిగా ఉన్న ఫొటోలో ఆమెను చాలా మంది నెటిజన్లు గుర్తుపట్టలేకపోయారు. ప్రస్తుతం ఈ చిత్రాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
'కాటమరాయుడు' తర్వాత శ్రుతి తెలుగు సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నారు. తిరిగి రవితేజ కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న 'క్రాక్' సినిమాతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ బాణీలు అందిస్తున్నారు. తమిళంలోనూ 'లాభం' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి కథానాయకుడు. శ్రుతి గాయనిగానూ కెరీర్‌ను రాణిస్తున్నారు. ఇప్పటికే విదేశాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇచ్చారు.
![Shruti Haasan shared her fans with Gender Swap photo](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7756975_2406shruti-haasan.jpg)