అగ్రహీరో నందమూరి బాలకృష్ణకు(balakrishna movies) జోడీగా శ్రుతిహాసన్(shruti haasan boyfriend) నటించనుందా? ఈ ప్రశ్నకు సమాధానం అవుననే వినిపిస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
![Balakrishna and Gopichand malineni movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13478360_nbk-107.jpg)
వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందనున్న ఈ సినిమా(balakrishna new movie) కోసం స్క్రిప్టు సిద్ధమవుతోంది. హీరోయిన్ ఎంపికపై ప్రస్తుతం దృష్టి పెట్టింది చిత్రబృందం. త్రిష మొదలుకొని శ్రుతిహాసన్ వరకు పలువురు భామల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇందులో శ్రుతిహాసన్(shruti hassan first movie) నటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన సినిమాల్లో 'బలుపు', 'క్రాక్'లో శ్రుతినే కథానాయిక. తదుపరి సినిమా కోసమూ శ్రుతినే సంప్రదించారట. ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి 'సలార్'లో(salaar release date) నటిస్తున్న శ్రుతి.. బాలకృష్ణ సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం.
![Shruti Haasan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13478360_balayya.jpg)
ఇవీ చదవండి: