సమంత ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'ఓ బేబీ'. నందినిరెడ్డి దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. నాగశౌర్య, లక్ష్మీ, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ ప్రధాన పాత్రధారులు. చిత్రీకరణ పూర్తయింది. జులై 5న విడుదల కానుంది. ‘ఓ బేబీ' చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్‌లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ.
హిందీలో శ్రద్ధా కపూర్‌ను ప్రధాన పాత్రలో పెట్టి నిర్మించాలని చిత్ర నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు ప్రయత్నాలు చేస్తున్నారట. అందుకు శ్రద్ధా కూడా సానుకూలంగా స్పందించిందట. దానికి అనుగుణంగా సురేష్ సంస్థ చిత్ర హక్కులనూ సంపాదించారని సమాచారం. కానీ శ్రద్ధా కపూర్ కాల్షీట్ల సర్దుబాటు విషయంలో కొంత సందిగ్ధం ఏర్పడినట్లు తెలుస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘సాహో' సినిమాలో నటిస్తోంది బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్.