సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా 'పుష్ప' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రష్మిక మంధాన హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అయితే బన్నీ-సుకుమార్-దేవీ కాంబినేషన్ అంటే కచ్చితంగా ఓ ఐటెమ్ సాంగ్ ఉండాల్సిందే. అలాగే ఈ సినిమాలోనూ ఓ ప్రత్యేక గీతం ఉండబోతుందట. ఈ సాంగ్‌లో నర్తించేందుకు బాలీవుడ్ భామల్ని సంప్రదించిందట చిత్రబృందం.
'సాహో' భామ శ్రద్ధా కపూర్‌ను ఇందుకోసం సంప్రదించారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో ప్రత్యేక సాంగ్ కోసం ఊర్వశి రౌతేలాను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. మరి ఈ స్పెషల్ సాంగ్‌లో ఎవరు కనిపిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.