ETV Bharat / sitara

'ఆలియా, రణ్​బీర్​ను మించిన నటులున్నారా?' - Find me a better actor than Alia Bhatt, Ranbir Kapoor

బంధుప్రీతిని(నెపోటిజం)​ ఉద్దేశిస్తూ ప్రముఖ దర్శకుడు బల్కి చేసిన పోస్ట్​ ప్రస్తుతం నెట్టింట్లో దుమారం రేపుతోంది. ఆలియా, రణ్​బీర్​కు మించిన నటులెవరైనా ఉన్నారా? అంటూ సందేశం పెట్టారు. దీనిపై స్పందించిన నెట్టిజన్లు సహా ప్రముఖ దర్శకులు శేఖర్​ కపూర్​, అపూర్వ అస్రాని.. బల్కి వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ranbeer
రణ్​బీర్​
author img

By

Published : Jul 18, 2020, 1:02 PM IST

బాలీవుడ్ నటుడు సుశాంత్​ సింగ్ బలన్మరణం చెంది నెలరోజులు గడుస్తున్నా... ఇంకా బంధుప్రీతి (నెపోటిజం) అంశంపై చర్చకు తెరపడలేదు. స్టార్​ హీరోయిన్​ కంగనా రనౌత్​ సహా పలువురు నటీనటులు​.. హిందీ చిత్రసీమలో బంధుప్రీతి, పక్షపాతం ఉన్నాయని ఆరోపించారు. స్టార్స్ వారసులకు మాత్రమే అవకాశాలు ఇస్తున్నారని, సినీ నేపథ్యం లేనివారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. అయితే జూలై 18న ప్రముఖ దర్శకుడు బల్కి దీనిపై స్పందించారు.

అలా అనడం మూర్ఖత్వం!

నెపోటిజం​ అన్ని రంగాల్లో ఉంటుందన్న బల్కి.. దాని ప్రభావం ఎవరి మీదా పెద్దగా పడదని అన్నారు. స్టార్​ వారసులైన మాత్రాన వారిలో నైపుణ్యం లేనిదే ఎదగలేరన్నాడు. అయినా తల్లిదండ్రుల నుంచి వారి వృత్తిని పిల్లలు వారసత్వంగా తీసుకోవడాన్ని బంధుప్రీతి​ అనడం సరికాదన్నారు. స్వేచ్ఛాయుత సమాజంలో ఉన్న వ్యక్తులు ఈ విధంగా భావించడం మూర్ఖత్వమని అభిప్రాయపడ్డారు.

ఆలియా, రణ్​బీర్​కు మించిన వారు

స్టార్ ​హీరోయిన్​ ఆలియా భట్​, హీరో రణ్​బీర్​ కపూర్​కు మించిన నటులు ఎవరైన ఉన్నారా? అంటూ సవాల్​ విసిరారు బల్కి. ప్రస్తుతం దీనిపై సామాజిక మాధ్యమాల్లో ఓ మినియుద్ధమే జరుగుతోంది.

తప్పు మాట్లాడావ్​ బల్కి..!

బల్కి పోస్ట్​పై స్పందించిన నెటిజన్లు సహా బాలీవుడ్​ ప్రముఖ దర్శక నిర్మాత శేఖర్​ కపూర్​, అపూర్వ అస్రాని.. ఆయన వ్యాఖ్యలపై ఏకీభవించలేదు. చిత్రపరిశ్రమలో బంధుప్రీతి ఉందని ఉద్ఘాటించారు. దీంతోపాటు కంగనా రనౌత్​, అక్షయ్​ కుమార్​, ప్రియంకా చోప్రా, తాప్సీ, విక్కీ కౌషల్​, రాజ్​కుమార్​ రావ్​, మనోజ్​ బాజ్​పేయీ, నవాజుద్దీన్​, సుశాంత్​, ఆయుష్మాన్​ ఖురానా సహా పలువురు నటులు.. ఆలియా, రణ్​బీర్​ కన్నా మెరుగ్గా నటించగలరాని అన్నారు. వీరిద్దరిని నెపోటిజం​ ఉత్పత్తులుగా అభివర్ణించారు.

  • Some filmmakers & journalists are so star struck, that they gush over mediocre actors with famous surnames. Repeatedly, these actors headline projects & the press gushes. Talented actors are mostly used as garnishing--to make the mediocre look better, but NEVER to outshine them.

    — Apurva (@Apurvasrani) July 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Best actors today are coming from theatre. Theres new found respect for them. And confidence.
    I’ve worked with Naseer, Shabana,Satish Kaushik, Seema Biswas and entire cast of Bandit Queen, Cate Blanchett, Geoffrey Rush, Heath Ledger Daniel Craig Eddy Redmayne
    All are from theatre

    — Shekhar Kapur (@shekharkapur) July 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆలియా విషయంలో చేస్తారా?

ఒకవేళ ఆలియా ఆత్మహత్యకు పాల్పడితే పోలీసులు, ప్రభుత్వం సుశాంత్​ కేసును ఛేదించడంలో చేస్తోన్న అలక్ష్యం.. ఆమె విషయంలో కూడా చేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. వీటికి సంబంధించిన ఆ పోస్టులన్నీ మీరే చూసేయండి.

  • #RanbirKapoor
    Ayushmann Khurana, Vicky Kaushal, Rajkumar Rao & many others will always name Ranbir Kapoor as great actor but fans of Ayushmann Khurana, Vicky Kaushal and Rajkumar Rao will find it hard to believe in their star's compliment on RK.

    — Anusuya Bhattacharya (@IndianAnusuya) July 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #SSRCaseIsNotSuicide
    Hello Old Monk! tryna get attention by giving a controversial statement?
    A better actor than kAlia & Ronbir ... Just A?

    Here you go Old Man:
    Ayushman Khurana
    Rajkumar Rao
    Vidhyut Jamwal
    Randip Hodda
    John Abraham
    .
    Guys, what's your suggestion? Tell him more pic.twitter.com/t1Md55uT0D

    — Immortal Sushant Singh Rajput (@RiPSushantSR) July 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇది చూడండి :స్టార్​ వారసులే కానీ సక్సెస్​కు చాలా దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.