జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మొట్టమొదటి తెలుగు సినిమా 'శంకరాభరణం'. ఇటీవలే ఈ చిత్రం 40 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా బాపురమణ అకాడమీ ఆధ్వర్యంలో.. హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్‌లో సోమవారం రాత్రి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డిజిటల్ వెర్షన్లోకి మార్చిన ఈ సినిమాను ప్రదర్శించారు. నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కుమారులు ఏడిద శ్రీరామ్, ఏడిద రాజాలు ఈ బాధ్యత తీసుకున్నారు.
ఈ సందర్భంగా కళాతపస్వి విశ్వనాథ్ మాట్లాడుతూ.. 'ఫిబ్రవరి 1980లో శంకరాభరణం చిత్రం విడుదలైంది. నేను 'శంకరాభరణం'.. ఇప్పుడు చూసినా 40 ఏళ్లు వెనక్కి వెళ్లినట్టుగా ఉంది’ అని అన్నారు.
దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. "శంకరాభరణం', 'సాగర సంగమం' లాంటి చిత్రాలను ప్రస్తుత దర్శకుల నుంచి ఆశించకూడదు. ఎందుకంటే కె.విశ్వనాథ్ అనే వ్యక్తి ఒక్కరే వీటికి చిరునామా' అని చెప్పాడు.
ఈ కార్యక్రమంలో చంద్రమోహన్, డబ్బింగ్ జానకి, భీమేశ్వర్రావు, సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఎల్బీ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది చదవండి: నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్న 'శంకరాభరణం'