ETV Bharat / sitara

ఆ చిత్రం నుంచి తప్పుకున్న షాహిద్? - యోధ నుంచి తప్పుకున్న షాహిద్

బాలీవుడ్​ నటుడు షాహిద్​ కపూర్​.. 'యోధ' చిత్రం నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. 'జెర్సీ' తర్వాత అతడు ఈ సినిమా చేయాల్సి ఉంది.

Shahid Kapoor opts out of Shashank Khaitan's Yoddha?
ఆ చిత్రం నుంచి తప్పుకున్న షాహిద్?
author img

By

Published : Dec 23, 2020, 4:05 PM IST

'యోధ' చిత్రం నుంచి బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. తొలుత ఈ సినిమా చేయడానికి అంగీకరించినా ఇప్పుడు అతడు వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. శషాంక్​ ఖైతాన్​ దర్శకత్వంలో నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాను​ తెరకెక్కించనున్నాడు.

'యోధ'లో షాహిద్ నటిస్తున్నాడని ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయినా 'జెర్సీ' చిత్రీకరణ పూర్తి కాగానే ఈ షూటింగ్​లో అతడు పాల్గొంటాడని బాలీవుడ్ వర్గాలు చెప్పాయి. ఇటీవలే 'జెర్సీ' పూర్తయింది. కానీ సృజనాత్మక విభేదాల కారణంగా ఈ చిత్రం నుంచి 'కబీర్​ సింగ్'​ నటుడు తప్పుకున్నట్లు సమాచారం.

'కబీర్​ సింగ్​' భారీ విజయం తర్వాత షాహిద్​ స్వభావంలో విపరీతమైన మార్పులు వచ్చాయని 'యోధ' టీమ్​ అనుకుంటున్నట్లు ఓ బాలీవుడ్ వెబ్​సైట్ వెల్లడించింది. అతడిలో గర్వం, అహంకారం మితిమీరిపోయాయని తెలిపింది. దీంతో షాహిద్​తో సయోధ్య కుదురుతుందా లేదా వేరే నటుడితో ఈ సినిమా ముందుకెళ్తుందా అనేది తెలియాల్సి ఉంది.

వెబ్​సిరీస్​లతో దూకుడు..

'ఫ్యామిలీ మ్యాన్' వెబ్​ సిరీస్​తో భారీ విజయం దక్కించుకున్న రాజ్, డీకేల దర్శకత్వంలో షాహిద్​.. ఓ వెబ్​సిరీస్​లో నటించనున్నాడు. యాక్షన్​-థ్రిల్లర్​ జోనర్​లో రానున్న ఈ సిరీస్​లో తమిళ సూపర్​స్టార్​ విజయ్​ సేతుపతి ఓ కీలక పాత్రలో మెరవనున్నాడు. జనవరి నుంచి ప్రారంభమయ్యే మరో వెబ్​సిరీస్​లోనూ షాహిద్​ నటించనున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: 'సుప్రీమ్​' హీరో సినిమాపై మెగాస్టార్​.. రష్మిక బాలీవుడ్​ ఎంట్రీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.