ETV Bharat / sitara

ఓటీటీ వ్యాపారంలోకి షారుక్​.. పార్టీ అడిగిన సల్మాన్​ - Pathaan

Shah Rukh Khan OTT: ఇప్పటికే నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న బాలీవుడ్​ సూపర్​స్టార్ షారుక్​ఖాన్.. మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారు. త్వరలోనే ఓ ఓటీటీ యాప్​ను లాంచ్ చేయనున్నారు! అందుకు సంబంధించి షారుక్​ ఓ పోస్ట్​ చేయగా.. తనకు పార్టీ కావాలని అడిగారు మరో స్టార్​ హీరో సల్మాన్ ఖాన్.

author img

By

Published : Mar 15, 2022, 6:04 PM IST

Shah Rukh Khan OTT: ఓటీటీ వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నారు బాలీవుడ్​ బాద్​షా షారుక్​ఖాన్. ఈ మేరకు ట్విట్టర్​లో ఓ ఆసక్తికర పోస్ట్​ చేశారు. "ఓటీటీ ప్రపంచంలో ఇంకేదో జరగబోతోంది" అంటూ అభిమానులను ఊరించారు. దాంతో పాటే త్వరలోనే రాబోతున్నాం.. అంటూ 'ఎస్​ఆర్​కే ప్లస్'​ అనే లోగోను షేర్​ చేశారు.

పార్టీ ఇవ్వాలి..

ఇది ఓటీటీ యాప్​గా రాబోతోందా అనేది ఆయన నిర్మాణ సంస్థ రెడ్​ చిల్లీస్ ఎంటర్​టైన్మెంట్స్​ స్పష్టంచేయలేదు. ఈ పోస్ట్​ చూసిన అభిమానులు, బాలీవుడ్​ ప్రముఖులు షారుక్​కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొత్త ఓటీటీ యాప్​ తీసుకురాబోతున్నందుకు​ పార్టీ ఇవ్వాలని అడిగారు కండలవీరుడు సల్మాన్​ఖాన్.

ఇక ఈ వెంచర్​లో షారుక్​తో పాటు తను కూడా భాగస్వామిగా ఉన్నట్లు ప్రముఖ ఫిల్మ్​మేకర్​ అనురాగ్​ కశ్యప్​ వెల్లడించారు. ఈ ఓటీటీ యాప్​తో తన కల నిజమవబోతోందని సంతోషం వ్యక్తంచేశారు.

చివరగా 2018లో వచ్చిన 'జీరో' సినిమాతో వెండితెరపై మెరిసిన షారుక్​ త్వరలోనే 'పఠాన్'​ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 జనవరి 25న విడుదలకానుంది.

ఇదీ చూడండి: షారుక్​ 'పఠాన్'​ లుక్స్​.. స్టైలిష్​గా అలియా భట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.