ఇళయ దళపతి విజయ్ కొత్త సినిమా 'మాస్టర్'లోని పాటకు మాస్ స్టెప్పులేస్తూ అలరించింది నటి ప్రగతి. తన ఇన్‌స్టా ఖతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. లుంగీ కట్టుకొని ఆమె వేసిన స్టెప్పులపై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. అందులో ప్రగతితో పాటు తన కుటుంబ సభ్యుడు ఒకరు కనిపించాడు.
సినిమాల్లో తల్లి పాత్రలో కనిపించే నటి ప్రగతి.. రియల్ లైఫ్‌స్టైల్ మాత్రం వేరుగా ఉంటుంది. బయట ఆమె చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది. తన జీవితంలో జరిగే తీపి జ్ఞాపకాలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. కొన్ని నెలలుగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది.
- View this post on Instagram
Quarantine tales #vaathicoming #mothersonduo #master💕❤🤪🤪 HAPPY EASTER🤩😍🤩
">
ఇదీ చూడండి.. మోదీ అంకుల్ బయటకు వెళ్లొద్దన్నారు.. చిన్నారి ముద్దు మాటలు