ETV Bharat / sitara

''ఆడవాళ్లు మీకు జోహార్లు'తో ఓ కొత్త విషయాన్ని చెప్పబోతున్నాం'

Sarvanad Adavallu meeku joharlu movie: శర్వానంద్​, రష్మిక కలిసి నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా.. ఆడవాళ్ల గొప్పతనాన్ని చాటే చిత్రమని చెప్పారు దర్శకుడు తిరుమల కిషోర్​. ఈ మూవీ ద్వారా ఆడవాళ్ల గురించి ఓ కొత్త విషయాన్ని తెలియజేయబోతున్నట్లు తెలిపారు. ఇంకా ఈ చిత్రం గురించి పలు విశేషాలను తెలిపారు. ఆ విషయాలన్నీ ఆయన మాటల్లోనే..

Adavallu meeku joharlu
ఆడవాళ్లు మీకు జోహార్లు
author img

By

Published : Feb 17, 2022, 7:44 AM IST

Sarvanad Adavallu meeku joharlu movie: "నేను ప్రతి సినిమాకీ ఓ కొత్త కథ చెప్పాలనే అనుకుంటా. నా గత చిత్రాల్లో స్నేహం గురించి చెప్పా. ఓ పరాజితుడి గురించి చెప్పా. అలా ఈ చిత్రంలో ఆడవాళ్లకు సంబంధించిన ఓ కొత్త విషయం చెబుతున్నా. ఇకపైనా ఇదే పంథాలో నడుస్తా" అన్నారు తిరుమల కిషోర్‌. 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ', 'చిత్రలహరి' వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడాయన. ఇప్పుడు 'ఆడవాళ్లు మీకు జోహార్లు'తో అలరించేందుకు సిద్ధమయ్యారు. శర్వానంద్‌, రష్మిక జంటగా నటించిన చిత్రమిది. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర విశేషాలను తెలిపారు తిరుమల కిషోర్‌.

'ఆడవాళ్లు మీకు జోహార్లు' కథ తొలుత వెంకటేష్‌కు చెప్పినట్లున్నారు కదా?

"లేదు.. ఆ కథ వేరే. ఇది కొత్త స్క్రిప్ట్‌. టైటిల్‌ అప్పుడు వెంకటేష్‌ కోసం అనుకున్నదే. ఇందులో హీరో నేపథ్యమూ ఆ కథలో ఉన్నట్లుగానే ఉంటుంది. ఇంతకు మించి ఆయనకు చెప్పిన కథకు.. ఈ స్క్రిప్ట్‌కు ఏ సంబంధం ఉండదు. దీన్ని తొలుత వినిపించింది శర్వానంద్‌కే. అప్పటికి ఆయన ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేయాలని ఆలోచనలో ఉన్నారు. కథ చెప్పగానే ‘బాగుంది.. నాకు సరిగ్గా సరిపోయే కథ’ చేద్దామన్నారు".

ఆడవాళ్ల గొప్పతనాన్ని చాటే చిత్రమంటున్నారు. టైటిల్‌ పాటలో హీరోకి వాళ్లపై ఉన్న ఫ్రస్టేషన్‌ను చూపించారు?

"పదిమంది ఆడవాళ్లు ఉన్న ఇంట్లో ఒక్కడే మగ పిల్లాడు ఉంటే.. వాడిపై అందరికీ ఎంత ప్రేమ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరో పాత్ర నేపథ్యం అలాంటిదే. వాళ్ల విపరీతమైన ప్రేమ వల్ల పెళ్లి విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటుంటాడు. అందుకే వాడి బాధను అలా పాట రూపంలో చెప్తాడు. అలాగని వాళ్లపై తనకి కోపమని కాదు. వాళ్లందరంటే తనకీ చాలా ప్రేమే. ఆ ఒక్క సందర్భంలోనే అలా ఉంటాడు. మళ్లీ తెల్లారితే అందరి మధ్య అవే ప్రేమానురాగాలు కనిపిస్తాయి. సినిమాలో ఉన్న ప్రతి పాత్రకూ ప్రాధాన్యముంటుంది. ఏ ఒక్క పాత్ర లేకున్నా... తెరపై కథ ముందుకు సాగదు. అలాగే అన్ని పాత్రలున్నా కథలో హీరో ఫోకస్‌.. హీరోదే. నేను ఈ కథ రాసుకున్నప్పుడే రాధిక, ఖుష్బూ, ఊర్వశిలను తీసుకోవాలనుకున్నాం. ఎందుకంటే ఇలాంటి కథలకు అలాంటి అనుభవమున్న నటీమణులైతేనే న్యాయం చేయగలుగుతారు".

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కొత్త చిత్రాల విశేషాలేంటి?

"డీవీవీ దానయ్య నిర్మాణంలో ఓ చిత్రం చేయనున్నా. నాగచైతన్య కథానాయకుడు. చక్కటి ప్రేమకథతో రూపొందనుంది. ప్రస్తుతం ఆయన చేయనున్న ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాక పట్టాలెక్కుతుంది. వెంకటేష్‌తోనూ సినిమా ఉంటుంది. అది ఎప్పుడన్నది చెప్పలేను".

ఈ కథ ఎలా ఉండనుంది?

"అందరికీ కనెక్ట్‌ అయ్యే కథ ఇది. ఎందుకీ మాట చెబుతున్నానంటే.. నేను పాప పుట్టిన నాలుగు నెలలకి ఇండస్ట్రీకి వచ్చేశా. ఆరేడు నెలలకి ఒకసారి ఇంటికెళ్లి వస్తుండేవాడ్ని. రోజూ ఇంటికొచ్చే తండ్రితో పిల్లలు ఎలా ఉంటారు? ఆర్నెళ్లకు ఒకసారి ఇంటికొచ్చే తండ్రితో ఎలా ఉంటారు? అన్నది అనుభవిస్తేనే తెలుస్తుంది. నేను కొన్నేళ్ల తర్వాత ఇంటికెళ్లినప్పుడు మా అమ్మాయికీ నాకు మధ్య ఓ తెలియని దూరం ఉన్నట్లు అర్థమైంది. ఇద్దరికీ ఒకరిపై మరొకరికి విపరీతమైన ప్రేమ ఉంది. కానీ, ఏదో తెలియని దూరం ఉండేది. ఇదే ‘నేను శైలజా’ సినిమాకి స్ఫూర్తినిచ్చింది. ఈ చిత్ర కథ విషయానికొస్తే.. ఆడవాళ్లు లేకుండా మన జీవితాల్ని ఊహించుకోలేం. ప్రతి సందర్భంలోనూ మనం వాళ్లకు జోహార్లు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్‌నే తెరపై ఎందుకు చెప్పకూడదు అన్న ఆలోచనలో నుంచి ఈ చిత్రం పుట్టింది. దీంట్లో మన ఇంట్లోని ఆడవాళ్ల జీవితాలే కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. వాళ్లు మనకు ఎంత ప్రేమను అందిస్తున్నారు? మన నుంచి ఎలాంటి ప్రేమను కోల్పోతున్నారు? అన్నవి చూపించాం".

ఇదీ చూడండి: వచ్చే మూడు నెలలు సినిమాలే సినిమాలు.. లిస్ట్ ఇదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.