టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తోన్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి దర్శకుడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మొదటి నుంచి చెప్పిన చిత్రబృందం తాజాగా విడుదల తేదీని ఖరారు చేసింది.
-
It's official... #SarileruNeekevvaru in cinemas from Jan 12th, 2020!! This Sankranti will be my biggest and most special :):)
— Mahesh Babu (@urstrulyMahesh) October 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Thankyou @anilravipudi 🤗@vijayashanthi_m @iamRashmika @thisisDSP @RathnaveluDop @GMBents @AnilSunkara1 @AKentsOfficial @SVC_official pic.twitter.com/Q7l0BPTH74
">It's official... #SarileruNeekevvaru in cinemas from Jan 12th, 2020!! This Sankranti will be my biggest and most special :):)
— Mahesh Babu (@urstrulyMahesh) October 12, 2019
Thankyou @anilravipudi 🤗@vijayashanthi_m @iamRashmika @thisisDSP @RathnaveluDop @GMBents @AnilSunkara1 @AKentsOfficial @SVC_official pic.twitter.com/Q7l0BPTH74It's official... #SarileruNeekevvaru in cinemas from Jan 12th, 2020!! This Sankranti will be my biggest and most special :):)
— Mahesh Babu (@urstrulyMahesh) October 12, 2019
Thankyou @anilravipudi 🤗@vijayashanthi_m @iamRashmika @thisisDSP @RathnaveluDop @GMBents @AnilSunkara1 @AKentsOfficial @SVC_official pic.twitter.com/Q7l0BPTH74
ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది. ఇదే తేదీన అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారు చేసిన గంట వ్యవధిలోనే 'సరిలేరు నీకెవ్వరు' తేదీని ప్రకటించడం విశేషం.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మహేశ్ ఆర్మీ అధికారి అజయ్ కృష్ణగా కనిపించనున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో విజయ శాంతి ఓ కీలక పాత్రలో కనపించనుంది.
ఇవీ చూడండి.. 'అల వైకుంఠపురములో' విడుదల తేదీ ఖరారు