ETV Bharat / sitara

సంక్రాంతికి హీరోలు సై.. బరిలో నాలుగు సినిమాలు - టాలీవుడ్ సంక్రాంతి సినిమాలు

ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. ఇందులో క్రాక్, మాస్టర్, రెడ్, అల్లుడు అదుర్స్ ఉన్నాయి. మరి ప్రేక్షకుల్ని ఎంతలా అలరిస్తాయో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

sankranthi 2021 movie festival in tollywood
సంక్రాంతికి హీరోలు సై.. బరిలో నాలుగు సినిమాలు
author img

By

Published : Jan 4, 2021, 7:24 AM IST

కరోనా భయం కొనసాగుతున్న వేళ...థియేటర్లు తెరిస్తే ప్రేక్షకులు వస్తారా? మునుపటిలా వసూళ్లు ఉంటాయా? యాభై శాతం ప్రేక్షకులతో సినిమాలు గట్టెక్కుతాయా? - ఇలా మొన్నటి వరకూ ఎన్నెన్నో సందేహాలు వెంటాడాయి. 'సోలో బ్రతుకే సో బెటర్‌' చిత్రానికి ప్రేక్షకుల నుంచి లభించిన ఆదరణ చూశాక పరిశ్రమలో నమ్మకం పెరిగింది. వరుసగా సంక్రాంతి సినిమాల విడుదల తేదీలు ఖరారైపోయాయి. తెలుగునాట ఎప్పట్లాగే ఈసారీ సంక్రాంతి బరిలోకి నాలుగు చిత్రాలు దిగాయి. వినోదాన్ని పంచేందుకు పోటాపోటీగా ముస్తాబవుతున్నాయి.

ముగ్గుల పండగలో సినిమా కూడా ఓ భాగం. సంక్రాంతికి తెలుగులో ఎన్ని సినిమాలు విడుదలైనా ప్రేక్షకులు చూస్తారని ఓ నమ్మకం. కుటుంబమంతా కలిసి థియేటర్లకు వెళుతుంటారు. అందుకే సంక్రాంతి అనగానే సినిమాలు వరుస కడుతుంటాయి. తెలుగు చిత్ర పరిశ్రమ అతి పెద్ద సీజన్‌గా పరిగణిస్తుంటుంది. బాక్సాఫీసు దగ్గర సరికొత్త రికార్డులు నమోదవుతుంటాయి. అగ్ర తారల సినిమాలతోపాటు పరిమిత వ్యయంతో తెరకెక్కిన చిత్రాలు కూడా మెరుస్తుంటాయి. అయితే కరోనా భయాలు కొనసాగుతున్న వేళ ఈసారి సినీ సంక్రాంతి ఎలా ఉంటుందో అనే సందేహాలు వెంటాడాయి. కానీ ఎట్టకేలకు ఆ సందేహాలన్నింటినీ పటాపంచలు చేస్తూ నాలుగు సినిమాలు విడుదల తేదీల్ని ఖరారు చేసుకున్నాయి. రవితేజ 'క్రాక్', రామ్‌ 'రెడ్‌', బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ 'అల్లుడు అదుర్స్‌', విజయ్‌ 'మాస్టర్‌' చిత్రాలు ఈసారి సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి. వీటిపై నిర్మాతలు పెట్టిన పెట్టుబడులు రూ.120 కోట్ల పైమాటే అని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

vijay master cinema
మాస్టర్ సినిమాలో విజయ్
raviteja krack cinema
క్రాక్​ సినిమాలో రవితేజ

'క్రాక్‌'తో మొదలు

ఈసారి సంక్రాంతిని ఆరంభించే కథానాయకుడు... రవితేజ. మాస్‌ అనే మాటకు అసలు సిసలు నిర్వచనంలా నిలుస్తుంటాయి ఆయన సినిమాలు. ఇక ఆయన సినిమా సంక్రాంతికి విడుదలవుతోందంటే ఆ సందడి వేరుగా ఉంటుంది. ‘బలుపు’, ‘డాన్‌శీను’ తర్వాత గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రవితేజ చేసిన చిత్రం ‘క్రాక్‌’. శ్రుతిహాసన్‌ నాయిక. బి.మధు నిర్మించారు. సంక్రాంతి సీజన్‌ను ఆరంభిస్తూ, 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. విజయవంతమైన కలయిక కావడం, సంక్రాంతి సీజన్‌లో విడుదలవుతుండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతికి అతిథుల్లాగే... మన ముగ్గుల పండగకు తమిళ కథానాయకుల సినిమాలు కూడా వస్తుంటాయి. గతేడాది రజనీ సినిమా వచ్చింది. ఈసారి విజయ్‌ ‘మాస్టర్‌’ వస్తోంది. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో వహించిన ‘మాస్టర్‌’ ఈ నెల 13న విడుదలవుతోంది. దక్షిణాదితో పాటు, హిందీలోనూ విడుదలవుతోంది. ఈ సినిమాను మహేష్‌ ఎస్‌.కోనేరు తెలుగులో విడుదల చేస్తున్నారు.

యువ హవా

సంక్రాంతి బరి అంటే అగ్ర తారల సినిమాలే ఎక్కువ. ఈసారి మాత్రం యువ తారలకు అవకాశం దక్కింది. రామ్‌ ‘రెడ్‌’ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. రామ్‌ ద్విపాత్రాభినయం చేసిన చిత్రమిది. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించారు. స్రవంతి రవికిశోర్‌ నిర్మాత. ఓటీటీ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినప్పటికీ థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేయాలని పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగాడు రామ్‌. సంక్రాంతి పండగలో అల్లుళ్ల సందడి ప్రత్యేకం. కొత్త అల్లుళ్లతో తెలుగు లోగిళ్లు కళకళలాడుతుంటాయి. ఈసారి ఆ కళను మా ‘అల్లుడు అదుర్స్‌’ తీసుకొస్తుందని చెబుతున్నాడు మరో యువ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో, సుబ్రమణ్యం గొర్రెల నిర్మిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్,‌ నభా నటేష్‌ నాయికలు. కుటుంబ కథతో తెరకెక్కడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

alludu adhurs cinema news
అల్లుడు అదుర్స్​లో శ్రీనివాస్, నభా నటేశ్
ram red cinema
రామ్ రెడ్ సినిమా

సవాళ్లు చాలానే

ఎప్పట్లాగే సంక్రాంతి సినిమాల జోరైతే కనిపిస్తోంది కానీ... సవాళ్లు కూడా అందుకు దీటుగానే కనిపిస్తున్నాయనేది వ్యాపార వర్గాల మాట. కరోనా జాగ్రత్తల్లో భాగంగా యాభై శాతం సీటింగ్‌ కెపాసిటీతోనే థియేటర్లలో ప్రదర్శనలు చేయాల్సి రావడం, మరోపక్క కరోనా భయాలు ఇప్పటికీ తగ్గకపోవడం నిర్మాతల్నీ, వ్యాపార వర్గాల్నీ కలవర పెడుతున్న విషయాలు. థియేటర్లు సర్దుబాటు అనేది ఎప్పట్నుంచో ఉన్న సమస్య. లాక్‌డౌన్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు మూతపడిపోయాయి. ఉన్న థియేటర్లనే నాలుగు సినిమాలూ పంచుకోవాలి. పైగా బరిలోకి దిగుతున్న సినిమాలన్నీ భారీ పెట్టుబడులతో తెరకెక్కినవే. వీటిపై నిర్మాతలు పెట్టిన పెట్టుబడుల విలువే సుమారు రూ.120 కోట్లు ఉంటుందని అంచనా. మరి యాభై శాతం ప్రేక్షకులతో ఏ స్థాయిలో వసూళ్లు రాబట్టుకోగలవనేది చూడాలి. కొంతకాలంగా సినిమాలకి ప్రారంభ వసూళ్లే కీలకంగా మారాయి. వారం, రెండు వారాలలోపే సినిమాలు అనుకున్న వసూళ్లని రాబట్టాల్సిందే. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమేనా అనేది సందేహం. కరోనా వల్ల ఓవర్సీస్‌ మార్కెట్‌ దెబ్బతింది. ఇదివరకటిలాగా ముందస్తు వ్యాపారం జరగడం లేదు. ఇక పైరసీ సమస్య ఉండనే ఉంది. సంక్రాంతి సినిమాలు సాధించే ఫలితాలు ఈ ఏడాది పరిశ్రమ భవితవ్యాన్ని నిర్దేశిస్తాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.