సమంత అక్కినేని తన భర్త నాగచైతన్యతో కలిసి లాక్‌డౌన్ కాలంలో ఇంట్లోనే ఉంటూ సరదగా గడుపుతోంది. కరోనా వైరస్‌తో సినిమా షూటింగ్‌లు ఆగిపోవడం వల్ల ఇంట్లోనే తనకు ఇష్టమైన పనులు చేస్తూ, వాటి గురించి ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిప్రాయాలు పంచుకుంటోంది. తాజాగా ఈ అమ్మడు బయో ఎంజైమ్స్ తయారు చేయడం గురించి నేర్చుకొంది.
"ఈ ఎంజైమ్స్‌ను ఫ్లోర్ క్లీనర్స్, బాత్రూమ్ క్లీనర్స్, గ్లాస్ క్లీనర్స్, డిష్ వాషింగ్, లాండ్రీ లాంటి వాటికి ఉపయోగించవచ్చు. అంతేకాదు వీటిలోని మంచి బ్యాక్టీరియాతో ఇంట్లోని మరకలను తేలికగా శుభ్రం చేయవచ్చు"
-సమంత, నటి
ఈ బయో ఎంజైమ్స్ తయారు చేయడం తన ఫ్రెండ్ ద్వారా నేర్చుకున్నానని తెలిపింది సామ్. ప్రస్తుతం ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మొత్తం మీద సమంత ఇంట్లోనే ఖాళీగా కూర్చోకుండా యోగా, మిద్దెపై మొక్కల పెంచడం ఇలా అన్నీ నేర్చుకుంటోంది. ఒక విధంగా లాక్‌డౌన్ సమంతకు ఎన్నో నూతన విద్యలు నేర్పిందని చెప్పవచ్చు. సామ్ ఇప్పటికే ఇషా క్రియా అనే ధ్యాన యోగానూ చేస్తోంది. మొత్తం ఈ అన్‌లాక్ పూర్తయ్యేసరికి, యోగాలో ఉన్న అన్ని విద్యలు నేర్చుకుంటుందేమో చూద్దాం.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ప్రస్తుతం సమంత తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి 'కాతువాకుల రెండు కాదల్' అనే చిత్రం చేస్తుంది. ఇందులో నయనతార కూడా నటిస్తోంది. విఘ్నేస్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. 'ది ఫ్యామిలి మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌లోను నటించింది. ఈ సిరీస్ త్వరలోనే విడుదల కానుంది.