సమంత అక్కినేని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'సామ్‌జామ్' కార్యక్రమానికి నాగచైతన్య అతిథిగా విచ్చేశారు. 'ఆహా'లో ప్రసారమవుతున్న ఈ టాక్‌షోకు ఇప్పటివరకు చాలామంది సెలబ్రిటీలు అతిథులుగా వచ్చి అలరించారు. ఇప్పుడు చైతూ రావడం షోపై ఆసక్తి పెంచుతోంది. ప్రముఖ సెలబ్రిటీ జోడీగా పేరొందిన 'చైసామ్' చేసే సందడి ప్రేక్షకులను కచ్చితంగా అలరించనుంది.
ఈ మేరకు ఆహా తన ట్విట్టర్లో షోకు సంబంధించి వీరిద్దరి ఫొటోలు ఉంచి ''చైసామ్' కెమెస్ట్రీ చూడడానికి సిద్ధంగా ఉండండి' అంటూ పోస్ట్ చేసింది. ఇటీవలే కొత్త సంవత్సర వేడుకలను ఈ జంట గోవాలో జరుపుకొంది. సమంత ఈ టాక్‌షో ద్వారా చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, తమన్నా, రకుల్ వంటి టాప్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసింది.