నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత హీరోయిన్ సమంత(samantha akkineni husband) కెరీర్ విషయంలో జోరు పెంచింది. వరుసగా సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తోంది. ఇప్పుడు కెరీర్లోనే తొలిసారి ప్రత్యేక గీతంలో కనిపించేందుకు అంగీకరించింది. 'పుష్ప' 5వ సాంగ్‌లో ఆమె బన్నీతో కలిసి స్టెప్పులేయనుందని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈ మేరకు ఆమెకు థ్యాంక్స్ చెబుతూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

ఈ వార్తలతో బన్నీ, సామ్ ఫ్యాన్స్ తెగ సంతోషపడిపోతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్లు అనుష్క, కాజల్, తమన్నా, పూజాహెగ్డే(pooja hegde movies) ఇలా పలువురు ముద్దుగుమ్మలు కూడా కొన్ని చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌తో మెప్పించారు.
మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న 'పుష్ప' చిత్రాన్ని(pushpa movie songs) స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండగా(sukumar alluarjun movie) హీరోయిన్గా రష్మిక నటిస్తోంది(alluarjun rashmika movie). సునీల్, ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకులు. 'పుష్ప ది రైజ్' పేరుతో మొదటి భాగాన్ని ఈ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

సామ్.. త్వరలోనే 'శాకుంతలం'(shakuntalam release date), 'కాతు వాకుల రెండు కాదల్' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతోపాటే ఈ మధ్యలో రెండు బడా ద్విభాషా ప్రాజెక్ట్‌లకు అంగీకారం తెలిపింది. అంతకుముందు అల్లుఅర్జున్, సమంత కలిసి త్రివిక్రమ్(trivikram next movie) దర్శకత్వంలో వచ్చిన 'సన్ ఆఫ్ కృష్ణమూర్తి' సినిమాలో నటించారు.
ఇవీ చదవండి:
- Samantha: అరుదైన గౌరవం సొంతం చేసుకున్న సమంత
- భారీగా రెమ్యునరేషన్ పెంచిన సమంత!
- సమంత తొలి హిందీ సినిమా.. ఆ హీరోయినే నిర్మాత..!
- అభిమానుల ఆవేదన- సామ్ అంత పనిచేసిందా?
- మొత్తానికి నా కల నెరవేరింది: సమంత
- 'పుష్ప' ట్రీట్.. అల్లుఅర్జున్ కొత్త లుక్ అదుర్స్
- 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప' టీమ్స్ మాస్టర్ ప్లాన్.. ఆ దేశంలో ఈవెంట్స్!
- Pushpa release date: హిందీలో 'పుష్ప' రిలీజ్ కష్టమేనా?
- 1000 మంది డ్యాన్సర్లతో 'పుష్ప' సాంగ్.. థియేటర్లలో పూనకాలే!