ETV Bharat / sitara

ఆ ఫొటోను దారుణంగా ట్రోల్​ చేశారు! - సమంత న్యూస్​

'జాను' చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సమంత.. తన పెళ్లి తర్వాత జరిగిన విషయాలను పంచుకుంది. ఇటీవల ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముచ్చటించిన ఈ ముద్దుగుమ్మ.. పెళ్లి తర్వాత తన కెరీర్​పై ఆశలు వదులుకున్నట్లు పేర్కొంది. ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అవేంటో తెలుసుకుందామా?

samantha akkineni share his experiance after his marriage
పెళ్లి తర్వాత నా కెరీర్​పై ఆశలు వదులుకున్నా
author img

By

Published : Mar 18, 2020, 9:32 PM IST

ప్రముఖ సినీనటి సమంత తన పెళ్లి తర్వాత జరిగిన కొన్ని విషయాలను పంచుకుంది. వివాహం అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఓ ఫొటోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారని గుర్తు చేసుకుంది సామ్​. 2019 'హైదరాబాద్‌ టైమ్స్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమన్‌' జాబితాలో సమంత అగ్ర స్థానంలో నిలిచింది. ఆన్‌లైన్‌ పోలింగ్‌ ద్వారా ప్రజలు ఆమెను ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో సమంత ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది.

samantha akkineni share his experiance after his marriage
సమంత

చైతన్య షాక్​ అయ్యాడు..

"తాజాగా వచ్చిన అవార్డు జాబితాలో నా పేరు టాప్‌లో ఉండటం చూసి షాక్‌ అయ్యా (నవ్వుతూ). కానీ గొప్పగా అనిపించింది. ఓ పెళ్లైన మహిళకు ఈ టైటిల్‌ రావడం మంచి పరిణామం. సమాజంలోని మార్పును ఇది సూచిస్తోంది. పెళ్లైన నటి అని తేడా చూపించకుండా ప్రతిభను గుర్తించారు. ఈ విషయం చైతన్యకు చెప్పినప్పుడు 'ఏంటి?' అని ఆశ్చర్యపోయాడు. కొన్ని నిమిషాలకు 'నిజంగా?.. నీకు పెళ్లైంది కదా!' అన్నాడు."

నా ఫ్యాషన్ పెళ్లి ప్రభావం...

"పెళ్లి జరిగిన తర్వాత కెరీర్‌పై ఆశలు వదులుకున్నా. ఎందుకంటే నా ముందు హీరోయిన్స్‌ పరిస్థితి అలానే ఉంది. వాళ్లంతా పెళ్లి బ్రేక్‌ తర్వాత మళ్లీ కనిపించలేదు. నాకూ అలానే జరుగుతుంది అనుకున్నా. కానీ పెళ్లి ప్రభావం నా కెరీర్‌పై పడకపోవడం సంతోషంగా ఉంది. కుటుంబం కూడా ఎంతో మద్దతుగా ఉంది. పెళ్లి నా ఫ్యాషన్‌ ఛాయిస్‌ను మార్చలేదు."

ఆ విమర్శలు తట్టుకోలేకపోయా...

"నాకింకా గుర్తుంది. పెళ్లి తర్వాత ఓ గ్లామరస్‌ డ్రెస్‌తో ఉన్న ఫొటో పోస్ట్ చేశా. కొందరు ఘోరంగా విమర్శించారు. బాగా ట్రోలింగ్​ చేశారు. అప్పుడు చాలా కష్టంగా అనిపించింది. అలానే రెండోసారి కూడా ఫొటో షేర్‌ చేశా. అప్పుడు విమర్శలు తగ్గాయి. ఏదైనా సరే మొదటి అడుగు వేయడం వరకే అని అప్పుడు అర్థమైంది. నేను ధైర్యంగా ముందుకొచ్చానని చెప్పడం లేదు. నాకు విమర్శలన్నా, అలాంటి వాతావరణం అన్నా చాలా భయం. పరిస్థితులు మారాలి. దానికి తగినట్లు నేను ప్రవర్తించాలని అనుకుంటుంటా. మనం ధరించే దుస్తులు మన వ్యక్తిత్వాన్ని నిర్వచించవని ప్రజలు అర్థం చేసుకోవాలి."

నా ఫీలిగ్​ని బట్టే దుస్తులు..

"ఇవాళ నా ఫీలింగ్‌ ఎలా ఉంటే అలాంటి దుస్తులు ధరిస్తా. ఉదాహరణకు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న రోజు కాస్త గ్లామరస్‌గా ఉండాలి అనుకుంటా. అది పక్కవారి కోసం కాదు. కేవలం నా సంతృప్తి కోసం మాత్రమే. మేకప్‌కు పనిచేయడానికి పది మందితో కూడిన బృందం ఉంది. 'ఏం ధరించాలి? ఎలాంటి మేకప్‌ వేసుకోవాలి? కొత్త స్టైల్‌ ఏంటి? కొత్త లుక్‌ ఏంటి?' అనే విషయాలు వారే చెబుతుంటారు."

ఆ విషయంలో మాకు అభద్రత భావం ఎక్కువ...

"కొంత మంది అమ్మాయిలు తాము కూడా స్టార్స్‌లా అందంగా ఉండాలి అనుకుంటుంటారు. కానీ నిజం చెప్పాలంటే మేకప్‌ విషయంలో అందరి కంటే మేమే ఎక్కువ అభద్రతా భావంతో ఉంటాం. మాకు ఇతరుల సాయం చాలా అవసరం. నేను సరైన డైట్‌ పాటిస్తూ, జిమ్‌కు వెళ్తుంటా. నాకు నా వృత్తంటే చాలా ఇష్టం. దాని కోసం వంద శాతం కష్టపడతా.. పడుతున్నా" అని సామ్‌ చెప్పింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.